శాతవాహనుల పరిపాలన వ్యవస్థ
- నాసిక్ మరియు కార్లే గుహ శాసన ద్వారా వీరిపాలన విధానం గూర్చి తెలుస్తుంది.
- మొదట్లో వీరి పాలన మౌర్యుల పాలన సంప్రదాయాలను అనుసరించారు.
- రాజు రాజ్యానికి అధిపతి. రాజు దైవాంశ సంభూతుడనే భావన ఉండేది.
- రాజు, మహారాజు వంటి బిరుదులు ధరించారు.
- రాజుకు పరిపాలనలో సహాయపడటానికి 4 అమాత్యులు ఉండేవారు.
- విశ్వ అమాత్య - రాజు ఆంతరంగిక సలహాదారుడు (ప్రధాని)
- రాజు అమాత్య - రాజు ఆదేశాలను అమలు పరిచేవాడు
- మహా అమాత్య - ఆర్ధిక మంత్రి
- మహా తలవర - ప్రధాన సైన్యాధిపతి
వీరితోపాటు రాజుకు సలహాలిచ్చేవారు
- మహారథులు - రాష్ట్రాన్ని పాలించే అధికారులు
- మహాభోజకులు - రాష్ట్ర పాలకుడు హోదా
- మహాసేనాపతి - సైన్యాధిపతి
- హిరణ్యకుడు - కోశాధికారి (ద్రవ్యపరమైన ఆదాయాన్ని)
- భండారీక - వస్తురూపంలో ఆదాయాన్ని భద్రపరిచేవారు
- మహాతరక - రాజు అంగరక్షకుడు
- నిబంధకర - దస్తావేజుల ఆదాయాన్ని భద్రపరిచే వారు
- గ్రామకుడు - గ్రామాధికారి
- మహామంత్రులు - బౌద్ధ బిక్షువుల బాధ్యతలను చూసేవారు
శాతవాహన రాజ్యాన్ని మూడు భాగాలుగా విభజించారు అవి
- రాజు కంఖేట ప్రాంతం - రాజు ప్రత్యక్ష పాలనలో ఉన్నటువంటి ప్రాంతం
- సామంతుల ప్రాంతం
- సరిహద్దుల ప్రాంతం
శాతవాహనుల రాజ్యాన్ని కొన్ని ఆహారాలుగా (రాష్ట్రాలుగా) విభజించారు. వీటి పాలకుడు అమాత్యులు
- నగరాలను నియమాలనే వారు
- కుల పెద్దలను గుహాపతులు అనేవారు
- గ్రామల్లో పాలన బాధ్యతలను చూసే అధికారిని గ్రామిక లేదా గుమిక అనేవారు.
- గౌల్మికులు అనగా సైన్యాధిపతులు
- గౌల్మీకుడు అంటే 30 మంది సైనికులకు ఆధిపతి
- గ్రామల్లో సమస్యల పరిష్కరానికి "మహాకార్యక" అనే ప్రభుత్వ అధికారి ఉండేవాడు.
- రాజు యొక్క సొంతభూమిని "రాజు ఖంకేట" అనేవారు
వీరి సైన్యం 4 రకాలుగా విభజించారు
- రథ
- గజ
- అశ్విక
- చతురంగ
- శాతవాహనుల సైనిక శిబిరాలను స్కంధవారం, కటకమని పిలిచేవారు
- స్కంధవారం అంటే తాత్కాలిక సైనికశిబిరం మరియు కటక మంటే నగరాల్లో సైన్యాగారాలు.
- ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం భూమిశిస్తు. దీనిని రాజభోగ , దేయమేయ అనే రెండు రకాలుగా పిలిచేవారు.
- భూమిశిస్తు 1/6 వంతు మేరకు వసూలు చేసేవారు.
- చేతి వృత్తులపై "కరకర" అనే పన్నును విధించేవారు
- బౌద్ధవులకు, బ్రాహ్మణులకు భూదానం చేసేవారు.
- బ్రాహ్మణులకు భూదానం చేసిన మొదటి రాజు - గౌతమీపుత్ర శాతకర్ణి