శాతవాహనుల యుగం 5

శాతవాహనుల పరిపాలన వ్యవస్థ 

బావుల నుండి నీళ్లు తోడటానికి ఉడక యంత్రాలను వాడేవారు 

  1. ఉదగ యంత్రం - భూమిని దున్నే యంత్రం 
  2. ఘటిక -  యంత్రం - నీటిని పైకి లాగటానికి 
  3. గరిక యంత్రం - ముడి ప్రత్తి నుండి విత్తనాలు వేరు చేయడానికి వాడే యంత్రం 

  • రజ్జగాహకుడు భూమి శిస్తును నిర్ణయించి ఆ శిస్తును వసూలు చేసేవారు. 
  • అప్పట్లో 18 వృత్తి శ్రేణి వారు / అష్టాదశ వర్గాల వారు ఉండేవారు. 

  1. కొలికులు -- నేత కారులు 
  2. తిలిషకులు -- నూనె తీసేవారు 
  3. కాసకారులు -- ఇత్తడి పనివారు 
  4. కులరికులు / కుమారులు -- కుమ్మరులు 
  5. తెసకారులు -- మెరుగు పట్టేవారు 
  6. మణికారులు -- రత్నపని వారు 
  7. మాల కారులు -- పూల వర్తకులు 
  8. ఓద యాంత్రికులు -- ఉదయ యంత్రాలు చేసేవారు 
  9. లోహవాణియులు -- ఇనుప వర్తకులు 
  10. సువణ కారులు -- సువర్ణకారులు 
  11. వథకులు -- వడ్రంగులు 
  12. సెలవధకులు -- రాతపనివారు 
  13. అవేసినులు -- చేతివృత్తివారు 
  14. లేఖకులు -- రాయసగాళ్లు 
  15. చమ్మకారులు -- చర్మకారులు 
  16. పాసకారులు -- మేదరివారు 
  17. మీఠీకులు -- రాయి మెరుగు పెట్టేవారు 
  18. గధికులు -- సుగంధ ద్రవ్యాల వర్తకులు 

  • ఒక్కొక్క వృత్తిని అనుసరించేవారు ఒక్కొక్క శ్రేణిగా ఏర్పడ్డారు. వీరికి శ్రేష్టి అనే అధ్యక్షులు ఉండేవారు. 
  • వడ్డీ వ్యాపారులు 12% వడ్డీని వసూలు చేసేవారు 
  • స్వదేశీ వర్తకులు సంఘాలుగా ఏర్పడేవారు. ఈ సంఘాలనే నిభయ  లేదా నికాయ లేదా నిగమ 
  • అనేవారు. 
  • సంఘాల సమావేశాన్ని "గోష్ఠి" అనేవారు. 
  • గోష్ఠి అధ్యక్షుడుని శెట్టి అంటారు. 
  • శాతవాహనుల కాలంలో అత్యధికంగా సీసం నాణెములు ముద్రించబడ్డాయి. 
  • వీరికాలంలో రోమ్ దేశంతో వర్తకం బాగా జరిగేది. 
  • ఫ్లీని యొక్క గ్రంధం - "Natural History "
  • ఒక బంగారు నాణెం 35 వెండి నాణెములతో సమానం 
  • అప్పట్లో శాతవాహనుల ముఖ్యమైన ఓడ రేవు - మైసోలి(తూర్పు తీరం), కోల్డురా, కంటక సేల మరియు అల్లోసిగ్నే. 
  • పశ్చిమతీరం - బారుకాచ్(బ్రోచే-గుజరాత్) , సోహాల్, కళ్యాణ్. 
  • వీరికాలంలో ప్రధాన ఎగుమతులు - సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, మణులు మరియు పట్టు వస్త్రాలు 
  • వీరికాలంలో ప్రధాన దిగుమతులు - వెండి, బంగారం, వైన్
Previous..                                                                             Continue..