Andhra Pradesh Reorganization Process ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ.
ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ
- CWC (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) ప్రకటన (CWC Statement on Telangana State Formation)
- 2013 July 30న హైదరాబాద్ తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించింది.
- రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ 10 సంవత్సరాలపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
- పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలని సీడబ్ల్యూసీ తీర్మానం యొక్క సారాంశం.
- 5Tth August 2013న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని పార్లమెంటులో చిదంబరం గారు ప్రకటించారు.
- ఆంటోనీ కమిటీ(Anthony Committee on Telangana State Formation)
- 2013 August 6న AK.ఆంటోనీ అధ్యక్షుడిగా విభజన కమిటీ ఏర్పాటు చేశారు
కమిటీ సభ్యులు
1. దిగ్విజయ్ సింగ్
2. వీరప్పమెయిలీ
3. అహ్మద్ పటేల్
- 2013 October 3న కేంద్ర హోంశాఖ రూపొందించిన తెలంగాణనోట్ ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది
- సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పులు లేకుండాఆమోదం తెలిపింది
జీవోఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు (GOM on Telangana State Formation)
- 2013 October 8న రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ చైర్మన్గ గా కేంద్ర మంత్రుల జీవోఎం ఏర్పాటు అయింది.
కమిటీ చైర్మన్ ఏకే ఆంటోనీ (రక్షణ మంత్రి)
కమిటీ సభ్యులు
1. సుశీల్ కుమార్ షిండే (హోం మంత్రి)
2. చిదంబరం (ఆర్థిక మంత్రి)
3. వీరప్పమెయిలీ (పెట్రోలియం శాఖ మంత్రి)
4. జైరాం రమేష్ (గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి)
5. గులాం నబీ ఆజాద్ (ఆరోగ్య శాఖ మంత్రి)
ప్రత్యేక ఆహ్వానితుడు వి నారాయణ స్వామి
రాష్ట్ర విభజన మీద సూచనలు సలహాలు ఇవ్వాలని మంత్రులబృందం రాష్ట్ర పార్టీలను కోరింది.
కాంగ్రెస్, BJP, TRS, CPI, MIMలు తమ సూచనలతో నివేదికలు ఇచ్చాయి. మిగతా పార్టీలైన టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ మరియు సిపిఎం లు నివేదికలు ఇవ్వలేదు.
తెలంగాణపై పార్లమెంటరీ ప్రొసీడింగ్స్(Parliamentary Proceedings on Telangana)
- 2013 నవంబర్ 11-12 తేదీల్లో అఖిలపక్షం ఏర్పాటు చేసింది.
- 2013 డిసెంబర్ 5న పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయి.
- 2013 Decemeber 5న తెలంగాణ ముసాయిదా బిల్లు-2013ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
- పది జిల్లాలతో కూడిన తెలంగాణకు కేంద్రం ఆమోదం తెలిపింది తెలంగాణ లో సంతోషం వెల్లివిరిసింది.