తెలంగాణ చరిత్ర పూర్వయుగం
- చరిత్ర పూర్వయుగం అంటే లిఖిత పూర్వక ఆధారాలు లేని యుగం
- లిఖిత ఆధారాలు లభిస్తున్న గత 2300 సంవత్సరముల కాలాన్ని చారిత్రక యుగం అంటారు.
- తెలంగాణాలో మొదటిసారిగా చరిత్ర పూర్వ యుగానికి (బృహత్ యుగానికి) సంబందించిన ప్రదేశం నల్గొండ జిల్లా లోని వలిగొండ మరియు దీనిని పరిశోధన చేసినవారు - రాబర్ట్ బ్రూస్ పూట్.
- హైదరాబాద్ పురావస్తుశాఖ 1914లో ఏర్పాటు చేయబడింది.
- కొత్త రాతియుగంలో మానవుడు ఉపయోగించిన పనిముట్టు - రాగి
- రాక్షసగూళ్ళ యుగంలో మానవుడు ఉపయోగించిన పనిముట్లు - ఇనుప పనిముట్లు, కావున ఈ కాలాన్ని అయో (ఇనుప) యుగమని కూడా అంటారు. ఈ యుగంలో చిన్న చిన్న రాజ్యాలు, లిపి, నాగరికతా చిహ్నాలు ప్రారంభమైనవి. కాబట్టి ఈ యుగాన్ని "చరిత్ర పూర్వ యుగం" మరియు "చారిత్రక యుగం", "మధ్య సంధి యుగం (ప్రోటో హిస్టరీ) లేదా "పురా చారిత్రక యుగం" అని అంటారు.
- చరిత్ర పూర్వ యుగాన్ని వారు వాడిన పనిముట్ల ఆధారంగా కూడా పిలుస్తారు.
ఉదాహరణ:
దిగువపాత రాతియుగం - గులక రాయి పనిముట్లు
మధ్య పాత రాతియుగం - రాతి పెచ్ఛుల పనిముట్లు
ఎగువ పాత రాతియుగం - కొచ్చెటి పనిముట్లు
మధ్య రాతియుగం - చిన్న చిన్న రాతి పనిముట్లు
కొత్త రాతి యుగం - నున్నటి పనిముట్లు
రాక్షసగుళ్ల యుగం - ఇనుప లోహ పనిముట్లు
దిగువ పాత రాతియుగం (3 నుంచి 1.30 లక్షల సంవత్సరాల క్రితం):
ఈ యుగానికి చెందిన ముఖ్యమైన ప్రదేశాలు
- ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ , పొచ్ఛేర జలపాతం
- కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖిని , రామగుండం
- ఖమ్మం జిల్లాలోనే పాల్వంచ
- నల్గొండ జిల్లాలోని రాయవరం, ఏలేశ్వరం, నాగార్జున కొండ
- మహబూబనగర్ జిల్లా లోని చంద్రగుప్త పట్టణం మరియు ఈర్ల దిన్నె
- పెద్ద ఆకారాలతో ఉండే చేతి గొడ్డళ్లు, గోఖుడు రాళ్లు , వృత్తాకారపు రాళ్ళూ, ఈ యుగపు మనుషుల వేటలో మరియు ఆహారణ సేకరణలో ఉపయోగపడ్డాయి .
- ఈ యుగపు ఆయుధాలు ఆఫ్రికా లోని "అష్యులియన్" ప్రాంతపు ఆయుధాలతో పోలి ఉన్నాయి .
మధ్య పాత రాతి యుగం (1 లేదా . లక్షల సంవత్సరాల క్రితం):
- మొదటిసారిగా ఎద్దు అస్థిపంజరం అవశేషాలు లభించిన ప్రదేశం - మహబూబనగర్ జిల్లాలోని యపాలపాడు దగ్గర జరిపిన త్రవ్వకాల్లో. దీనినిబట్టి ఈ యుగపు మానవులకు ఎద్దులతో సంబంధం ఉంది అని అర్ధం అవుతుంది.
- ఈ యుగపు మానవులు వదిన పనిముట్లు - చిన్న తరహా గొడ్డళ్లు, గండ్ర గొడ్డళ్లు, గోకుడు రాళ్లు
ఎగువ పాత రాతి యుగం(క్రీ. పూ. 20000 - 10000 సంవత్సరాల క్రితం) :
- ఈ యుగంలో జీవించిన ప్రజలు బ్లేడ్ పనిముట్లు, ప్రక్క అంచు ఉన్న బ్లేడ్ పనిముట్లు మరియు కొన్నిచోట్ల ఎముకలతో చేసిన పనిముట్లను వాడారు.
- రాతి గుహల్లో రంగు బొమ్మలను గీయడం నేర్చుకున్నారు
- ఇది "హాలోసీన్" ఆరంభ దశను చుసిస్తుంది.
మధ్య రాతి యుగం(క్రీ.పూ. 8500 - 3000 సంవత్సరాల క్రితం):
- భౌగోళిక వాతావరణ పరంగా "తోలి హాలోసీన్" యుగానికి చెందినది.
- ఈ యుగంలో అతి చిన్న (సూక్ష్మ) రాతి ఆయుధాలను వాడారు.
- ఈ యుగాన్ని 'సూక్ష్మ రాతి యుగం" అని కూడా అంటారు.
- ఈ యుగానికి చెందిన గుహల్లోని రంగు చిత్రాల్లో 150 కి పైగా బొమ్మలు కనిపిస్తాయి.
- వీటిలో ప్రధానంగా జింక, చెవుల పిల్లి, హైనా, నక్క, కుక్క, తాబేలు, రేఖాగణిత నమూనాలు సున్నపురాయి, గ్రానైట్ రాయి కొండా గుహలలో కనిపిస్తాయి.
- వీటిలో ముఖ్యమైనది జింక చిత్రం.
కొత్త రాతి యుగం (క్రీ.పూ. 3000 - 1500 సంవత్సరాల క్రితం):
- ఈ యుగం మలిదశలో రాగి, కంచుతో పనిముట్లను తయారు చేయడం నేర్చుకున్నారు. వీటి సహాయంతో భూమిని త్రవ్వి మొక్కలను నాటడం, పెంచడం మరియు పంటలను పండించడం నేర్చుకున్నారు.
- దీని వల్లనా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా కుటుంబం, సమాజం, గ్రామం ఏర్పడ్డాయి.
- పండిన పంటలను నిల్వ చేసుకోవడానికి పాత్రలు అవసరమైనాయి దీనివల్ల కుండలు, బానాలు తయారు చేసుకోవడానికి కారణమైనది. మొదట కుండలను చేత్తో చేసేవారు తరువాత కుమ్మరి చక్రాన్ని కనుకొన్నారు. వ్యక్తిగత ఆస్థి అనే భావన పుట్టి ధనిక - పేద సమాజ ఏర్పాటుకు దారి తీసింది.
- పశువులను మఛ్చిక చేసుకున్నారు. పంట ఉత్పత్తి చేయడానికి వ్యాపారం పుట్టుకకు దారి తీసాయి.
- కరీంనగర్ జిల్లా లో తొగర్రాయి అవాసంలో పైకి పొడుచుకు వఛ్చిన గ్రానైట్ గుట్టల దగ్గర పనిముట్లను తయారుచేసే కేంద్రం కనిపించింది.
- మట్టిపాత్రలకు ఎక్కువగా కెంపు రంగు అలంకారం ఉండేది.
- ఈ యుగపు ఆర్ధిక వ్యవస్థ ప్రధానంగా పశుపోషణ , వ్యవసాయం మీద ఆధారపడింది.
- బూడిద కుప్పలు, కొన్ని అడవి జంతువుల లేదా పశువుల దొడ్లు లభించిన ప్రదేశం - మహబూబనగర్ జిల్లాలోని ఉట్నూరు
- మూపురపు ఎద్దుల టెర్రకోట బొమ్మలు, తాటి చిత్ర లేఖనాలు కరీంనగర్ జిల్లాలోని బూదగది, వరంగల్ జిల్లాలోని పాండవుల గుట్ట, నల్గొండ జిల్లాలోని రాచకొండ, ఖమ్మం జిల్లాలోని నల్లముడి, మహబూబనగర్ జిల్లాలోని దుప్పాడు గుట్ట, దొంగల గట్టు తదితర ప్రాంతాలు వెలుగు చూశాయి.
- ఈ కాలంలో ప్రజలు ప్రదానంగా జొన్నలు, పప్పులు మరియు వడ్లు పండించేవారు. పంటలను ప్రధానంగా వర్షాధారంగానే పండించేవారు.
- కొత్త రాతియుగంలో చనిపోయిన వారి తలను ఉత్తరం వైపు పెట్టి ఖననం చేసేవారు.
- నాగార్జునకొండలో ఆవాస ప్రాంతంలో ఇద్దరి శిశువులను కుండలో సమాధి చేసిన ఆధారాలు కనిపించాయి.
రాక్షసగుళ్ల యుగం (క్రీ.పూ. 1500 - క్రీ. శ . 300 సంవత్సరాల వరకు)
- ఈ యుగంలో ఇనుప వస్తువులు వాడటం వలన దీనిని అయో యుగమని అంటారు.
- చనిపోయిన వారి అస్థి పంజరాలను శవపేటికలో గాని, రాతిగుండులో కానీ పెట్టి పూడ్చి ఆ గూడు చుట్టు పెద్ద పెద్ద రాళ్లను వలయాకారంలో నిలిపేవారు. కావున ఈ యుగాన్ని రాక్షసగుళ్ల యుగం అంటారు. స్థానిక ప్రజలు వీటిని పాండవుల గూళ్ళు మరియు వీర్లపాడులని కూడా అంటారు.
- చనిపోయిన వ్యక్తికి ప్రియమైన పెంపుడు జంతువులను (కుక్క) కూడా అతనితోపాటు ఖననం చేసేవారు.
- హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆవరణలో ఉన్న రాక్షసగూడు సమాధి దేశంలోనే మొదటిది.
- రాక్షసగుళ్ల సమాధులను నిర్మాణం ఆధారంగా 4 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి
1) గుంత సమాధులు: గుంత తవ్వి అందులో మట్టి శవపేటికలో గాని, దీర్ఘచతురస్రాకారపు రాతి పలకల గదిలో గాని అస్థిపంజరాన్ని పూడ్చి దాని చుట్టూ వలయాకారంలో పెద్ద పెద్ద రాళ్లను నిలిపితే దానిని గుంత సమాధి అంటారు.
2) గూడుసమాదులు: దీర్ఘచతురస్రాకారపు రాతి గదిని పూర్తిగా పూడ్చి వేయకుండా ఒక మూరెడు ఎత్తు భూమి ఉపరితలంపైకి కనిపించే విధంగా పూడ్చి దాని మీద ఒక రాతి పాలకను పెడితే దానిని గూడు సమాధి అంటారు.
3) గది సమాధి : రాతి సమాధి మొత్తం భూమి ఉపరితలం మీదనే ఉంటె దానిని గది సమాధి అంటారు.
4) గుహ సమాధులు: కొండల్లో గుండ్రటి గుహలను తొలచి వాటిల్లో శవాలను పెట్టి కప్పువేస్తే వాటిని గుహ సమాధులు అంటారు.
- మహబూబనగర్ జిల్లాలోని ఉప్పలపాడు గుంతసమాధిలో పడవ ఆకారపు శవపేటిక లభ్యమైంది. చిన్నమారూర్ గూడు సమాధిపై తడిక గుర్తులు కనిపించాయి.
- మహబూబనగర్ జిల్లాలో ఉన్న వీరాపురం సమాధుల్లో అనేక రకాల 'ఆహార ధాన్యాలు' లభించాయి. వాటిలో ముఖ్యమైనవి వరి, బార్లీ మరియు కొర్రలు వంటి తృణ ధాన్యాలు.
- హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లోని సమాధిలో రాగులు బయటపడ్డాయి.
- గుహరాళ్ళపై చెక్కిన రేఖాచిత్రాలలో ప్రధానంగా త్రిశూలం, చక్కంలో నుంచి దూరిపోయే త్రిశూలం మరియు బల్లెం కనిపిస్తాయి.