Causes to Jai Andhra Movement 1972 - జై ఆంధ్ర ఉద్యమం కారణాలు

 జై ఆంధ్ర ఉద్యమం - Jai Andhra Movement 

కారణాలు

1972 February 14న ఐదుగురు న్యాయమూర్తుల హైకోర్టు ధర్మాసనం 4-1 మెజార్టీతో 1919 లో నిజాం జారీ చేసిన  ముల్కీ నిబంధనల ఫర్మాణ చెల్లదని తీర్పు ఇచ్చింది. 

దీని వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలలో అసంతృప్తి నెలకొంది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి P.V.నరసింహారావు సుప్రీంకోర్టులో సవాలు చేశారు.  

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో OCTOBER 3, 1972న ముల్కీ నిబంధనలు న్యాయబద్ధమైనదేనని ఆ అమలులో ఉంటాయని పేర్కొంది. 

సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు తెలిపారు.

దీంతో ఆంధ్రాలో జై ఆంధ్ర ఉద్యమానికి బీజం పడింది. 


ప్రజా పరిషత్ (Praja Parishath)

ఈ ఉద్యమంలో భాగంగా OCTOBER 18న ప్రజా పరిషత్ ఏర్పడింది కాంగ్రెస్ మినహాయించి మిగతా రాజకీయ పక్షాలు ప్రజా పరిషత్ సమావేశానికి హాజరయ్యారు. 

ఈ సమావేశం విజయవాడలో నిర్వహించబడింది. 

ఈ సమావేశానికి సర్దార్ గౌతు లచ్చన్న అధ్యక్షుడిగా వ్యవహరించారు.

ఉపాధ్యక్షులు నడింపల్లి నరసింహారావు, కార్యదర్శిగా తుమ్మల చౌదరి మరియు కోశాధికారిగా జై చంద్రమౌళి వ్యవహరించారు.


జై ఆంధ్ర ఉద్యమ డిమాండ్ (Demand of the Jai Andhra Movement)

నిబంధనలు లేని ఆంధ్రప్రదేశ్ or ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరింది. 


ఆంధ్ర ఉద్యోగుల సమ్మె (Protest by Andhra Employees): 

ముల్కీ నిబంధనల రద్దు కోసం ఆంధ్ర ఉద్యోగులు 1972 December 7 నుంచి మార్చి 25, 1973 వరకు సమ్మె చేశారు. 

ఈ సమ్మె (108 రోజుల పాటు) సాగింది. 


జై ఆంధ్ర ఉద్యమంలో రాజీనామా చేసిన ఆంధ్ర మంత్రులు (Andhra Ministers who Resignations in Jai Andhra Movement 1972)

బివి సుబ్బారెడ్డి 

కాకాని వెంకటరత్నం 

బత్తిన సుబ్బారావు 

పి బసిరెడ్డి 

వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు 

మునుస్వామి 

చల్లా సుబ్బారాయుడు 

సి.హెచ్ ఆర్ ఎస్ వి మూర్తి రాజు 

సాగి సూర్యనారాయణ రాజు 

నవంబర్ 21, 1972 న ఆంధ్ర బంద్ కు పిలుపునిచ్చారు


For Job Notifications CLICK HERE      TSPSC WEBSITE CLICK HERE