తూర్పు చాళుక్యులు
తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు
వీరి రాజధాని కృష్ణా మరియు గోదావరి ల మధ్య ఉన్న వేంగీ ప్రాంతం
బాదామి చాళుక్య రాజైన 2వ పులకేశి వేంగీ ప్రాంతాన్ని జయించిన తరువాత తన సోదరుడైన కుబ్జవిష్ణువర్థునుడు ని ఆ ప్రాంత రాజ ప్రతినిధిగా నియమించారు. ఇతనినే వేంగీ చాళుక్య రాజ్యస్థాపకుడంటారు.
కుబ్జవిష్ణువర్థునుడు (క్రీ.శ.624-641)
- ఇతనియొక్క బిరుదులు - విషమసిద్ధి, కామదేవ, మకరద్వజ
- (క్రీ.శ.631 సంవత్సరం నాటి 'కొప్పర శాసనం' ఇతన్ని స్వతంత్రంగా పరిపాలించడానికి రెండవ పులకేశి అనుమతి ఇచ్చాడని తెలుపుతుంది.
- ఇతని కాలంలో చైనా యాత్రికుడు 'హ్యుయాన్ త్సాంగ్' పర్యటించాడు.
మొదటి జయసింహుడు (క్రీ.శ.642-673)
- ఇతనికి కల బిరుదులూ సకలలోకాశ్రయ, సర్వసిద్ది
- పిప్పర్ల గ్రామంలో(గుంటూరు జిల్లా) తెలుగు భాషలో శాసనం వేయించబడింది. ఇది తూర్పు చాళుక్యుల నాటి తెలుగు శాసనం.
ఇంద్రభట్టారకుడు (క్రీ.శ.673)
- ఇతను 7 రోజుల రాజ్యపాలన చేశాడు. ఈ వారంలో కొండనాగూరు శాసనం వేయించాడు.
- ఇతని యొక్క బిరుదులూ త్యగాధనుడు, మకరధ్వజుడు
రెండవ విష్ణువర్థునుడు (క్రీ.శ.673-682)
- ఇతనిని ప్రజలు ధర్మశాస్త్రవేత్త అని పొగిడారు
- ఇతనికి విషమసిద్ధి, మకరధ్వజుడు,సర్వలోకాశ్రయ, ప్రళయాదిత్య అనే బిరుదులు కలవు.
మంగి యువరాజు (క్రీ.శ.682-718)
ఇతనికి విజయసిద్ధి అనే బిరుదు కలదు
రెండవ జయసింహుడు (క్రీ.శ.706-718)
ఇతని కాలం నుంచి వారసత్వ యుద్దాలు మొదలైనాయి.
మూడవ విష్ణువర్థునుడు (క్రీ.శ.719-755)
- వీరి ముఖ్యపట్టణం మన్యఖేతనం
- హైదరాబాదు రాష్ట్రమునందు 'లాతురు' గ్రామం వీరి మొదటి నివాస ప్రాంతం
- ఇతనికి త్రిభువనంకుశ అనే బిరుదు కలదు
- వీరికాలంలో బాదామి చాళుక్యులు రాష్ట్రకూటులు అంతం చేశారు. దంతిదుర్గుని నాయకత్వాన నూతన సామ్రాజ్యం ఏర్పాటుచేశారు.
నాల్గో విష్ణువర్థునుడు (క్రీ.శ.772-808)
ఇతను రాష్ట్రకూట రాజు మొదటి కృషుణునికి సామంతుడిగా జీవితాన్ని ప్రారంభించాడు
రెండో విజయాదిత్యుడు (క్రీ.శ.808-847)
- ఇతనికి నరేంద్ర మృగరాజు అనే పేరు కలదు.
- ఇతనికి కల బిరుదులూ నరేంద్రేశ్వర, నరేంద్రమృగరాజు, చాళుక్యరాజ, విక్రమదావళి
కలివిష్ణువర్థునుడు (క్రీ.శ.847-848)
గుణగ విజయాదిత్యుడు (మూడవ విజయాదిత్యుడు (క్రీ.శ.849-892)
ఇతను తూర్పు చాళుక్యులలో అగ్రగణ్యుడు
ఇతను రాష్ట్రకూటుల చిహ్నాలుగా ఉండే పాళీ ధ్వజాన్ని మరియు గంగా - యమునా తోరణాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
మొదటి చాళుక్య భీముడు (క్రీ.శ.892-921)
ఇతని 30 సంవత్సరముల పరిపాలన కాలంలో 360 యుద్దాలు చేశాడు.
మొదటి అమ్మరాజు (క్రీ.శ.921-927)
- ఇతని కాలంలోనే రాజమహేంద్రపురం నిర్మించారు మరియు దీనిని వారి రాజధానిగా చేసుకున్నారు
- ఇతనికి రాజమహేంద్రుడనే బిరుదు కలదు.
రెండవ చాళుక్య భీముడు (క్రీ.శ.934-945)
రెండవ అమ్మరాజు (క్రీ.శ.945-970)
దానవర్ణుడు (క్రీ.శ.970-973)
జటా చోడ భీముడు (క్రీ.శ.973-999)
ఇతని రాజధాని కర్నూలు జిల్లాలోని పెద్దకల్లు
శక్తి వర్మ (క్రీ.శ.1000-1011)
ఇతనికి చాళుక్య చంద్రుడు అనే బిరుదు కలదు
విమలాదిత్యుడు (క్రీ.శ.1011-1018)
రాజరాజనరేంద్రుడు (క్రీ.శ.1019-1061)
క్రీ.శ.1075లో విజయాదిత్యుడు మరణించడంతో వేంగీ చాళుక్య వంశం అంతరించింది. తరువాత ఇది చోళ సామ్రాజ్యంలో కలిసిపోయింది.