Formation of Andhra Pradesh - ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ప్రక్రియ -1956 April 12న ఆమోదించారు
హైదరాబాద్ శాసనసభ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసే బిల్లును హైదరాబాద్ శాసనసభ 1956 April 12న ఆమోదించింది.
కొత్త తెలుగు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అని పిలవాలని హైదరాబాద్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు వి డి దేశ్ పాండే, కాంగ్రెస్ సభ్యుడు పాగపుల్లారెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని హైదరాబాద్ శాసన సభ ఆమోదించింది.
ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంత నాయకుల సమావేశంలో కొత్త రాష్ట్రం పేరును ఆంధ్ర - తెలంగాణ అని నిర్ణయించారు.
బిల్లులో (ఆంధ్ర - తెలంగాణ) ఆ విధంగానే పేర్కొన్నారు కానీ బిల్లు సెలెక్ట్ కమిటీ పరిశీలనలో రాష్ట్రం పేరును ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారు.
ఇందుకు ఆంధ్రుల ఒత్తిడే కారణము తేలింది విశాలాంధ్రలో తెలంగాణకు జరిగిన మొదటి మోసం ఇదే.
రాష్ట్ర ఏర్పాటుకు 1956 March 16న పార్లమెంట్ ఉభయ సభలలో రాష్ట్రాల పునర్నిర్మాణ బిల్లు (State Reorganisation Bill) ప్రతిపాదించబడింది.
1956 August 31న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్లును రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ఆమోదించారు.
1956 October 31న చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజప్రముఖ్ గా రాజీనామా చేశారు. 1956 November 1న నెహ్రూ కొత్త రాష్ట్రానికి ప్రారంభోత్సవం చేశారు
ఆంధ్రప్రదేశ్ రాజధాని హైకోర్టు - హైదరాబాద్
తొలి ముఖ్యమంత్రి - నీలం సంజీవరెడ్డి
తొలి గవర్నర్ - చందూలాల్ త్రివేది
తొలి స్పీకర్ - అయ్యదేవర కాళేశ్వరరావు
తొలి ప్రతిపక్షనేత - పుచ్చలపల్లి సుందరయ్య
శాసనమండలి చైర్మన్ - మాడపాటి హనుమంతరావు
డిప్యూటీ స్పీకర్ - కల్లూరి సుబ్బారావు
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంగా దాశరథి కృష్ణమాచార్య గారు "ఎన్నినాళ్ళ స్వప్నమిది" అనే గేయాన్ని రచించాడు.
1956 November 1న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సభ్యుల 12మంది గవర్నర్ చందూలాల్ త్రివేది ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా ఎవరిని పేర్కొనలేదు. వీరిలో ఏడుగురు ఆంధ్రప్రాంతానికి చెందిన వారు, ఐదుగురు తెలంగాణకు సంబంధించిన వారు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి మంత్రిమండలి (కేబినెట్)
నీలం సంజీవరెడ్డి (సీఎం - జనరల్ అడ్మినిస్ట్రేషన్ - పౌర సంబంధ సమాచార శాఖ తో సహా ఎన్నికలు, గృహవసతి కంట్రోలు, శాంతిభద్రతలు, అఖిల భారత సర్వీసులు మరియు హోం ప్లానింగ్
కె.వి.రంగారెడ్డి - రెవిన్యూ
కళావెంకట్రావు - ఆర్థికశాఖ, అమ్మకం పనులు, భూ సంస్కరణలు
జె వి నరసింగరావు - విద్యుత్ శక్తి, నీటిపారుదల
దామోదరం సంజీవయ్య -సహకార, దేవదాయ, సాంఘిక సంక్షేమం
వి.బి.రాజు - పరిశ్రమలు, వాణిజ్యం, కార్మిక శాఖ
పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి - వ్యవసాయం, అడవులతో సహా పశుసంపద, మత్స్య సంపద మరియు అధికాహారోత్పత్తి కార్యక్రమం
ఎస్ బి పి పట్టాభిరామారావు - విద్య
నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ బహదూర్ - ప్రజారోగ్యం
గ్రంధి వెంకట రెడ్డి నాయుడు - శాసన శాఖ, కోర్టులు మరియు జైలు
కాసు బ్రహ్మానంద రెడ్డి - స్థానిక పరిపాలన
మందుముల నరసింగరావు - భవనాలు, రహదారులు, సుంకములు, మధ్య నిషేధం.
For Job Notifications CLICK HERE TSPSC WEBSITE CLICK HERE