Gentlemen's Agreement 1956- పెద్ద మనుషుల ఒప్పందం
కేంద్ర హోంమంత్రి గోవింద వల్లభ పంత్ సమక్షంలో 1956 FEBRUAY 20న ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో లేదా దక్కన్ హౌస్ లో చర్చలు జరిగాయి.
పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన తేదీ - 1956 FEBRUAY 20
పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేసిన సభ్యుల సంఖ్య 8
పెద్ద మనుషుల ఒప్పందానికి హాజరైన సభ్యులు
తెలంగాణా ప్రాంతం వారు:
1) బూర్గుల రామకృష్ణారావు
2) మర్రి చెన్నారెడ్డి
3) కె.వి.రంగారెడ్డి
4) నర్సింగరావు
ఆంధ్ర ప్రాంతం వారు:
1) బెజవాడ గోపాలరెడ్డి
2) నీలం సంజీవరెడ్డి
3) గౌతు లచ్చన్న
4) అల్లూరి సత్యనారాయణ రాజు
1956 ఫిబ్రవరి 20న జరిగిన చర్చలలో 14 అంశాలపై ఒప్పందం కుదిరినట్లు గా అంగీకరించారు 1956 జూలై 19 న ఎనిమిదిమంది పెద్దమనుషులు ఈ ఒప్పందం మీద సంతకాలు చేశారు.
పెద్దమనుషుల ఒప్పందంలోని 14 అంశాలు:
1. రాష్ట్రంలో పరిపాలన వ్యయాన్ని ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల వారు వారి జనాభా నిష్పత్తిలో (Population Proportion) భరించాలి.
తెలంగాణకు సంబంధించి ఆదాయంలో ఖర్చు పోగా మిగిలిన ఆదాయాన్ని తెలంగాణ అభివృద్ధికే కేటాయించాలి.
ఈ ఏర్పాటు 5సంవత్సరాలు ఉంటుంది రాష్ట్ర శాసనసభలోని తెలంగాణ సభ్యులు కోరితే మరో 5సంవత్సరాలు పొడిగించాలి.
2. తెలంగాణాలో మద్యపాన నిషేధాన్ని తెలంగాణా శాసనసభ్యులు కోరిక మేరకు అమలు చేయాలి
3. తెలంగాణ లో ప్రస్తుతం ఉన్న విద్యా సౌకర్యాలను తెలంగాణ విద్యార్థులకే పరిమితం చేయాలి. వాటిని ఇంకా అభివృద్ధి చేయాలి.
4. తెలంగాణలోని సాంకేతిక విద్యా సంస్థలలో(Technical Education Institutions) ప్రవేశం తెలంగాణ విద్యార్థులకే పరిమితం చేయాలి లేదా రాష్ట్రం మొత్తం మీద మూడింట ఒక వంతు సీట్లను తెలంగాణ విద్యార్థులకు కేటాయించాలి. ఈ రెండిటిలో తెలంగాణ విద్యార్థులకు ఏది ప్రయోజనమో అదే చేయాలి.
5. సమైక్య రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉద్యోగుల సంఖ్య తగ్గించవలసి వస్తే ఆ తగ్గుదల రెండు ప్రాంతాల ఉద్యోగులకు తగిన నిష్పత్తిలో వర్తింప చేయాలి.
6. క్రొత్త ఉద్యోగ నియామకాలు రెండు ప్రాంతాల జనాభా నిష్పత్తిలో జరగాలి.
7. తెలంగాణలోని సాధారణ పరిపాలన న్యాయ విభాగాలలో ఉర్దూ భాషకు ప్రస్తుతం ఉన్న స్థానాన్ని మరో 5 సంవత్సరాలు కొనసాగించాలి.
ఆ తర్వాత పరిస్థితిని ప్రాంతీయ మండలి (Regional Council) సమీక్షించి తగు నిర్ణయం చేస్తుంది
ఉద్యోగంలో చేరే వారికి తెలుగు భాషా పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉండకూడదు
ఉద్యోగంలో చేరిన రెండేళ్లలో నిర్ణీతమైన తెలుగులో పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి
8. తెలంగాణ వాసులకే వారికి ప్రత్యేకించిన ఉద్యోగాలు దక్కడానికి 12 సంవత్సరాలు స్థానికులు ఉండాలనే నిబంధన ఉండాలి.
9. తెలంగాణ ప్రాంత వ్యవసాయిక భూముల అమ్మకం ప్రాంతీయ మండలి అధికార పరిధిలో ఉండాలి.
10. తెలంగాణ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ఒక ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలి.
11. ప్రాంతీయ మండలి లో 20 మంది సభ్యులు ఉంటారు
వీరిలో తొమ్మిది మంది శాసనసభ్యులు
వీరిని జిల్లాకు ఒకరు చొప్పున ఆ జిల్లాలోని శాసన సభ్యులు ఎన్నుకుంటారు
మరో ఆరుగురిని రాష్ట్ర శాసనసభలోని తెలంగాణ ప్రాంత సభ్యులు ఎన్నుకుంటారు
వీరు శాసనసభ సభ్యులుగా పార్లమెంటు సభ్యులు గాని కావాలి మిగిలిన ఐదుగురు శాసనసభ సభ్యులు కారు
కానీ వీరిని కూడా తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు ఎన్నుకుంటారు
12. ప్రాంతీయ మండలి ఈ క్రింది విషయాలలో నిర్ణయాధికారం కలిగి చట్టబద్ధమైన సంస్థగా రూపొందాలి
13. రాష్ట్ర మంత్రి మండలిలోని క్యాబినెట్ మంత్రుల నియామకం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య 60:40 నిష్పత్తిలో జరగాలి. తెలంగాణకు చెందిన మంత్రుల లో ఒకరు ముస్లిం ఉండాలి.
14. ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వాడైతే ఉపముఖ్యమంత్రి తెలంగాణా ప్రాంతానికి చెందిన వారే ఉండాలి
ముఖ్యమంత్రి తెలంగాణ వారైతే ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వారు ఉండాలి
మంత్రిత్వ శాఖలలో ప్రముఖమైన ఆర్థికశాఖ హోంశాఖ రెవిన్యూ శాఖ ప్రణాళిక అభివృద్ధి శాఖ వాణిజ్యం పరిశ్రమలు అనే ఐదు శాఖలో ఏవైనా రెండు తెలంగాణ మంత్రులకు కేటాయించాలి.
ఇదే సమయంలో విలీనం గురించి నెహ్రూ ఒక వ్యాఖ్య చేశారు. తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు కలిసి ఉండే పొంతన కుదరకపోతే ఆలుమగలు విడాకులు తీసుకున్న విధంగానే కొంతకాలం తర్వాత రెండు ప్రాంతాలు మరల విడిపోవచ్చు..
For Job Notifications CLICK HERE TSPSC WEBSITE CLICK HERE