కాకతీయులు (క్రీ.శ.995-1323) Kakatiya Dynasty History
- కాకతీయ వంశ స్థాపకుడు 1వ బేతరాజు
- వీరి యొక్క మూలపురుషుడు వెన్నడు
- మొట్టమొదటి స్వతంత్రపాలకుడు రుద్రదేవుడు
- అందరిలో గొప్పవాడు గణపతిదేవుడు
- కాకతీయులలో చివరి రాజు 2వ ప్రతాప రుద్రుడు
- వీరియొక్క రాజధాని హనుమకొండ, ఓరుగల్లు
- వీరియొక్క రాజ భాష సంస్కృతం
- శాతవాహనుల తరువాత తెలుగు ప్రాంతాన్ని ఒక దగ్గరకు తీసుకు వచ్చిన వారు కాకతీయులు.
- కాకతీయుల గురుంచి మొట్టమొదటిసారిగా మాగల్లు శాసనం (క్రీ.శ. 956) లో ప్రస్తావించబడింది. ఈ శాసనాన్ని వేయించినవారు వేంగీ చాళుక్య రాజు దానర్ణవుడు.
- కాకతి దేవత పేరు మీదుగానే వీరికి కాకతీయులు అని పేరు వచ్చింది.
- వినుకొండ వల్లభాచార్యుని క్రీడాభిరామం ప్రకారం వీరు ఓరుగల్లులో కాకతి మరియు ఏకవీర అనే గ్రామ దేవతలను పూజించారని మరియు ఓరుగల్లు కోటలో కాకతమ్మ దేవాలయం ఉండటం వల్ల వారికి కాకతీయులు అనే పేరు వచ్చింది.
- కాకతి అనగా దుర్గాశక్తి అని విద్యానాథుని ప్రతాపరుద్ర యశోధం కూడా వివరిస్తుంది.
- "కాకతమ్మ దేవత కాకతీర్నామ దుర్గా భజయంతి ఇతి కాకతీయ" అని విద్యానాధుడు పేర్కొన్నాడు.
- గణపతిదేవుని సోదరి 'మైలాంబ' బయ్యారం శాసనం వేయించింది. దీనిలో కాకతీయుల వంశం గురుంచి వివరించబడింది. దీని ప్రకారం కాకతీయుల మూలపురుషుడు వెన్నడు. ఇతను దుర్జయ వంశానికి చెందినవాడు. ఇతను రాష్ట్ర కూటుల సేనాపతిగా ఉండి వేంగి చాళుక్యులపై యుద్ధం చేశాడు.
- వెన్నడు యొక్క నాల్గవ తరం వాడు కాకతీ గుండ్యన. ఇతను వేంగి చాళుక్య రాజు మొదటి భీముడికి వ్యతిరేకంగా నిరువద్యపురం (క్రీ.శ. 900) చేశాడు. ఈ యుద్ధంలో భీముని కుమారుడు ఇరుముర్తి కాకతీయ గుండ్యను హతమార్చాడు. ఇతని ధైర్యసాహసాలకు 2వ కృష్ణుడు గుండ్యన కుమారుడు ఎర్రయ ను కొరివి ప్రాంతానికి పాలకుడిగా చేశాడు.
- ఎర్రియ అనంతరం బేతియ కొరివి పాలకుడు అయ్యాడు.
- బేతియ అనంతరం నాలుగవ గుండ్యన లేదా కాకర్త్య గుండ్యన కొరివి పాలకుడు అయ్యాడు. అప్పుడు వేంగి చాళుక్య రాజ్యంలో దానార్ణవుడు మరియు రెండవ అమ్మరాజు మధ్య వారసత్వ యుద్దాలు ప్రారంభమైనాయి. ఈ వారసత్వ యుద్ధంలో కాకర్త్య గుండ్యన దానార్ణవుడికి మద్దతు పలికాడు. దీనికి బదులుగా దానార్ణవుడు 'నతవాటి సీమ' ను కాకర్త్య గుండ్యనకు ఇచ్చాడు.
- ఇదే సమయంలో రాష్ట్రకూట రాజు 2వ కృష్ణుడు మరణించాడు. దీనితో రాష్ట్రకూటలు పతనం అయ్యారు.
- రాష్ట్రకూట చివరి రాజు రెండవ కర్కరాజు ను రెండవ తైలవుడు ఓడించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు.
- అప్పుడు కాకర్త్య గుండ్యన 2వ తైలవుడికి సామంతుడు అయ్యాడు. ఇతను హనుమకొండ రాకుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీరికి 1వ బేతరాజు జన్మించాడు. ఇతను గుమ్మడికాయ వలె ఉండేవాడు.
- కాకతి అనగా గుమ్మడి అని అర్ధం.
- మొదటి బేతరాజు కాలం నుంచి వీరిని కాకతీయులు అనేవారు.
- కాకర్త్య గుండ్యన సోదరి పేరు కామసాని. ఈమె భర్త విరియాల ఎర్ర భూపతి / ఎర్ర సేనాని. ఇతను 2వ తైలవుడికి సేనాధిపతి. ఇతని సహాయంతో ముదిగొండ పాలకుడు బొట్టు బేతరాజు కాకర్త్య గుండ్యనను హతమార్చాడు.
- దీని తరువాత మొదటి బేతరాజు అనుమకొండకు పాలకుడిగా ప్రకటించ బడ్డాడు.
- ఈ విధంగా అనుమకొండలో 1వ బేతరాజు కాకతీయుల పాలనను ప్రారంభించాడు.