Important Incidents in Telangana State Formation - కొన్ని ముఖ్యమైన సంఘటనలు

Important Incidents in Telangana State Formation - కొన్ని ముఖ్యమైన సంఘటనలు


కొన్ని ముఖ్యమైన సంఘటనలు

జై తెలంగాణ పార్టీ 

1997లో P. ఇంద్రారెడ్డి జై తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు 

ఇతను ఎవరి మాటలు వినకుండా తనఅనుచరులను అన్ని పదవిలో నియమించడం వల్ల అతనికి సహకరించిన వారందరూ దూరమయ్యారు 

దీంతో ఇతను అప్పటి PCC అధ్యక్షుడు అయిన డాక్టర్ వైఎస్ఆర్ ఆధ్వర్యంలో జై తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు


ఫోరం ఫర్ ఫ్రీడం ఎక్సప్రెషన్ సభ 

మొహాంజాహి మార్కెట్ దగ్గరలో గల అశోక్ థియేటర్లో 1997లో ఫ్రీడమ్ ఎక్సప్రెషన్ పేరుతో సభను నిర్వహించారు

ప్రముఖ జర్నలిస్ట్ అయిన గులాం రసూల్ ఖాన్ ఎన్ కౌంటర్ ను ఖండించడానికి కవులు మరియు కళాకారులు ఈ సమావేశాన్ని నిర్వహించారు 

గద్దర్ రాసిన 'అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా' అనే పాటను మొదటిసారిగా ఈ సభలోనే పాడారు 

గాదె ఇన్నయ్య ముద్రించిన 'దగాపడ్డ తెలంగాణ' అనే పుస్తకాన్ని కూడా ఈ సభలోనే ఆవిష్కరించారు

Important Incidents in Telangana State Formation - కొన్ని ముఖ్యమైన సంఘటనలు

తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ 

తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ 1998 అక్టోబర్ లో ఏర్పడింది 

ఈ సంస్థ అస్సాంలోని 'అస్సాం గణపరిష'త్ వలె పోరాటాలద్వారా మాత్రమే ప్రత్యేక తెలంగాణ సాధించగలమని ప్రజలకు విద్యార్థులకు బోధించారు


తెలంగాణ ఫోరం 

కన్వీనర్ జానారెడ్డి 

ఈ ఫోరం ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి వర్గం తెలంగాణకు జరిగిన అన్యాయాలపై 1992 September లో ప్రధానమంత్రి PV నరసింహారావు కు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి  కి వినతి పత్రాలు సమర్పించారు

నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తరువాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో జానారెడ్డికి మంత్రి పదవి లభించడంతో ఉద్యమం నుంచి తప్పుకున్నారు