Introduction to Satavahana Dynasty - శాతవాహన యుగం 1

Satavahana Dynasty: Introduction

తెలంగాణ అనే పదం ఢిల్లీ సుల్తానుల కాలం నుంచి వ్యవహారంలోకి వచ్చింది. అమిర్ ఖస్రు అనే కవి మొదటగా తెలంగాణను పేర్కొన్నాడు. 


ఆంధ్రుల ప్రస్తావన మొదటగా ఋగ్వేదంలో భాగమైన "ఐతరేయ బ్రాహ్మణం" లో క్రీ.పూ.1000  కలదు. 


దక్షిణ భారతదేశంలో వెలిసిన ఏకైక జనపదం  - అశ్మక(నిజామాబాద్ , కరీంనగర్ మరియు ఆదిలాబాద్) దీని రాజధాని బోధన్. (మొత్తం జనపదాలు 16)


క్రీ.పూ. 4 వ శతాబ్దంలో 'మొగస్తనీస్' అనే గ్రీకు రాయబారి తన "ఇండికా" గ్రంధంలో ఆంధ్రులకు ముప్పది కోటలున్న నగరాలు ఉన్నాయని, ఒక లక్ష కాల్బలం, రెండువేల అశ్విక బలం మరియు ఒక వెయ్యి గజదళం ఉన్నాయని పేర్కొన్నాడు. ఇదే విషయాన్నీ ఫ్లీని కూడా పేర్కొన్నాడు. 



మొగస్తనీస్ చెప్పిన కోటల్లో తెలంగాణాలో బోధన్, కోటిలింగాల, ధూళికట్ట, పెద్దబంకుర్ , కొండాపూర్, ఫణిగిరి, గాజులపురి, ఇంద్రపురి గా గుర్తించారు. 


కరీంనగర్ జిల్లా లోని 'పెద్దబంకుర్' లో కుమ్మరి కొలిమి ని కనుకొన్నారు. 


దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన తొలి  ప్రధాన రాజ వంశం శాతవాహనులది. 


మౌర్యుల కాలంలో సామంతులుగా ఉండి కణ్వ వంశ కాలంలో స్వతంత్రంను ప్రకటించుకున్నారు. 


తెలంగాణాలోని కోటిలింగాల లో వీరి పాలన ప్రారంభమై తరువాత ప్రతిష్ఠానపురం (పైఠాన్ ) రాజధాని అయింది. మలిశాతవాహనుల  కాలం నాటికీ ధనకటకానికి (ధాన్యకటకంగా) మార్పు చేయడం జరిగింది. 


శాతవాహనులు మగధ వరకు తమ దిగ్విజయ యాత్రను నిర్వహించారు. 


శాతవాహనుల కంటే ముందు తెలంగాణను పరిపాలించిన రాజ్యాలు 

క్రీ.పూ. 3 వ శతాబ్దం నాటి భట్టిఫ్రోలు స్థూపం లోని 'ధాతురకాండ' శాసనాల్లో కుభీరుడనే రాజు నిగమసభ మరియు గోష్ఠి ల సహాయంతో పరిపాలన చేసాడు. 


'వడ్డెమాను శాసనం' లో రజసోమకుడు, జంటుపల్లి

వేల్పూరు శాసనంలో సరిపద , మహాసద్ , అశోకపద, శివపద మరియు శివమ కసద పరిపాలించినట్లు పేర్కొన్నవి. 


కోటిలింగాలలో గోబద్ , సమగోప , నారన  మరియు కాంవయసిరి  నాణేలు దొరికాయి. 


"గోబద్"  తెలంగాణాలో మొదటిసారిగా నాణెములు వేయించాడు. 


శాతవాహనుల శాసనాలు బ్రహ్మలిపిలో మరియు పాకృత భాషలో ఉన్నాయి


సుధీర్ఘకాలానికి చెందిన 24 శాసనాలు మాత్రమే దొరికాయి.

నాసిక్-8, కన్హేరీ -5, కార్లే-3, భిల్సా -1, నానాఘాట్-2, మ్యాకదోని-1, చిన్నగంజాం-1, అమరావతి-2, కొడవలి-1 లభ్యమైనాయి.


నానేఘాట్ శాసనాన్ని మొదటి శాతకర్ణి భార్య రాణి నాయినిక(నాగానిక) వేయించింది. ఇది అలంకార శాసనం మాత్రమే.


కన్హేరీ శాసనాన్ని కృష్ణుడు(కన్హ) వేయించాడు.


గౌతమి బలసిరి  వేయించిన శాసనం - నాసిక్ మరియు తన కొడుకు గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలను ప్రస్తావిస్తుంది.


మహామేఘవాహన వంశానికి చెందిన కళింగ రాజు, ఖారవేలుడు వేయించిన హథీగంప శాసనం మరియు అతని సమకాలీనుడు అయినా శాతకర్ణి గురుంచి సమాచారం తెలియజేస్తుంది.


శాతవాహనులు సీసం మరియు రాగి నాణేలు అధిక సంఖ్యలో ముద్రించారు .

రాగి మరియు తగరం లోహాల మిశ్రమంతో 'ఫోటిన్' నాణేలను కూడా ముద్రించారు.


గౌతమి పుత్ర శాతకర్ణి వెండి నాణేలను కూడా ముద్రించాడు.


వీటిపై కొన్ని సంకేతాలు - వృషభం, ఏనుగు, సింహం, కొండ , ఉజ్జయిని, ఓడ , సూర్యుడు, చంద్రుడు, కమలం మరియు శంఖం ముద్రించేవారు.


తొలి  శాతవాహనుల శాసనాలు నానేఘాట్ మరియు నాసిక్ లో మాత్రమే లభించాయి.


మత్స్య పురాణం ప్రకారం 30 మంది రాజులూ 456 సంవత్సరములు పరిపాలించారని పేర్కొంది.


వాయుపురాణం ప్రకారం 17 మంది రాజులూ 272 సంవత్సరములు పరిపాలించారని పేర్కొంది.


శ్రీముఖుడు కణ్వ  రాజు సుశర్మను వధించి మగధను  ఆక్రమించి శాతవాహన రాజ్యాన్ని ఆక్రమించాడని అన్ని పురాణాలు  పేర్కొన్నాయి.


స్థాపన నుంచి గౌతమీపుత్ర శాతకర్ణి రాజ్యానికి వచ్చేవరకు గల రాజులను తొలి  శాతవాహనులు అని మరియు గౌతమీపుత్ర శాతకర్ణి నుంచి చివరి రాజుల వరకు మలి  శాతవాహనులు అంటారు.

                                                                                        Continue...