J M Girglani Commission - జె.ఎమ్. గిర్ గ్లాని కమిటీ
జె ఎమ్ గిర్ గ్లాని కమిటీ (J M Girglani Committee)
- June 25, 2001న 610 జీవో అమలును పరిశీలించడానికి జె ఎమ్ గిర్ గ్లాని కమిటీ ఏర్పాటు చేసింది-నారా చంద్రబాబునాయుడు
- ఈ కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం గడువు పెట్టింది
- ఈ కమిటీ విచారణకు ప్రభుత్వం సహకారం లేకపోవడంతో 25% ఉద్యోగుల జాబితాతో తొలి నివేదికను 2001 అక్టోబర్ లో ప్రభుత్వానికి సమర్పించింది
- మొదటి మధ్యంతర నివేదికలో 25% ఉద్యోగుల తొలి జాబితా తయారు చేయబడింది
సూచనలు
- ఈ కమిషన్ రాష్ట్రపతి ఉత్తర్వులు 610 జీవో అమలు కోసం తాత్కాలికమైన మరియు శాశ్వతమైన చర్యలను సూచించింది
- సర్వీసు పుస్తకాలలో స్థానికత నమోదు జరగాలి
- ఉల్లంఘలను సరిచేసిన తరువాత కొత్త నియమాకాలు, పదోన్నతులు చేపట్టాలి
- రాష్ట్రపతి ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి
- రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 అమలుపై శాశ్వత సభా కమిటీని చేయాలి
- రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 అమలుపై శాశ్వత మంత్రుల కమిటీని చేయాలి
- రాష్ట్రపతి ఉత్తర్వుల్లో 1975 అమలుపై శాశ్వత అధికారుల కమిటీని శాశ్వతంగా నియమించాలి
- సాధారణ పరిపాలన శాఖ చూసే సర్వీసు నిబంధనల విభాగం బలోపేతం చేయాలి
- G.O. 610 అమలులో ఉల్లంఘనలను అధ్యయనం చేయటానికి రాష్ట్ర శాసనసభ హౌస్ కమిటీని నియమించింది
జీవో 610 పై హౌస్ కమిటీ
- జూన్ 15, 2001న ఆరు సూత్రాల పథకం అమలు పైన 5, 6 జోన్లలో జీవో నెంబర్ 610 అమలు పైన ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది
- తెలంగాణ శాసనసభ్యులు 29th December, 2001న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉద్యోగ నియామకాలలో స్థానికులకు జరిగిన అన్యాయాల గురించి ప్రశ్నించారు
- దీనితో శాసనసభ హౌస్ కమిటీ నియమించబడింది.
- ఈ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాష్ (టిడిపి ఎమ్మెల్యే)
610 జీవో అమలుకు ఉత్తమ్ కుమార్ కమిటీ
- 2006 December 6న 610 జీవో అమలు కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు
- ఈ కమిటీ సభ్యుల లో ఉన్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు కొంతమంది రాజీనామా చేయడంతో 610 G.O. అమలు కాలేదు
ప్రతాప్ కిషోర్ ఢిల్లీ పాదయాత్ర
- జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్ ప్రత్యేక తెలంగాణ అంశంనకు దేశవ్యాప్త మద్దతు కోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1987 June 6న తన పాదయాత్రను చార్మినార్ నుండి ప్రారంభించారు
- వీరు ఢిల్లీకి చేరుకుని ప్రధానమంత్రికి మరియు కేంద్ర మంత్రులకు తెలంగాణ ఆవశ్యకతపై వినతి పత్రాలు సమర్పించారు
- ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన అనంతరం వీరు తెలంగాణ ప్రజా సమితిని 1987లో పునరుద్ధరించారు దీనికి అధ్యక్షుడుగా భూపతి కృష్ణమూర్తి ఎన్నికయ్యారు
వెలిచాల జగపతిరావు నివేదిక
- 1991,1992 ప్రాంతంలో తెలంగాణ ప్రముఖ రాజకీయ నాయకుడు జగపతిరావు నీటిపారుదల రంగం పై నివేదికను ప్రచురించారు
- కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతంలో తెలంగాణకు 1400 TMCల నీరు రావాలి. కానీ ఆంధ్రా పాలకులు తెలంగాణకు కేవలం 1170 TMCల నీరు పై హక్కు ఉన్నట్లు మాత్రమే చూపించారు
- శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, జూరాల, సింగూరు మరియు శ్రీశైలం ఎడమగట్టు కాలువ పూర్తయితే తెలంగాణలో 30 లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. కానీ ఆంధ్రా పాలకులు వీటిని పూర్తి చేయడం లేదు
- తెలంగాణలో ప్రాముఖ్యత గల నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి సాంకేతిక, పరిపాలన మరియు ఆర్థిక కారణాలు చూపిస్తూ దశాబ్దాలుగా వీటిని పూర్తి చేయడం లేదు