Jai Bharath Reddy Committee or Officers Committee - జై భరత్ రెడ్డి కమిటీ లేదా ఆఫీసర్స్ కమిటీ

Jai Bharath Reddy Committee or Officers Committee 

తెలుగు జాతీయత తెలంగాణ అస్తిత్వం 

తెలుగు ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీ 

1982 తెలుగు దేశం ఆవిర్భావం తర్వాత అనతికాలంలోనే 1983లో తెలుగు దేశం పార్టీ  అధికారంలోకి వచ్చింది 

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ 

రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా తెలంగాణ ప్రాంతంలో స్థానికేతరులు ఉద్యోగాలలో నియమించబడ్డారు అని టీఎన్జీవో సభ్యులు ఆధారాలతో ముఖ్యమంత్రి NTR కు తెలియజేశారు 

ఈ ఉల్లంఘనలు 1975 నుండి 1985 వరకు జరిగాయని పేర్కొన్నారు 

టిఎన్జీవోల విన్నపం మేరకు స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి NTR జై భారత రెడ్డి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశాడు


జై భారత్ రెడ్డి కమిటీ (Officers Committee OR Jai Bharath Reddy Committee )

ఈ కమిటీ 1985లో నియమించబడింది. ఈ కమిటీని ఎన్టీరామారావు నియమించారు 

ఈ కమిటీ కి మరొక పేరు- ఆఫీసర్స్ కమిటీ 

ఈ కమిటీ చైర్మన్ - జై భారత్ రెడ్డి ఐఏఎస్ 

ఈ కమిటీ సభ్యులు: ఉమాపతి, కమల్ నాథ్ 


ఈ కమిటీ నివేదిక 

రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా October 18, 1975 నుంచి జూన్ 30, 1985 ల మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా స్థానికేతరులు 56,962 మంది నియమించబడ్డారు అని తేల్చింది. 

జై భారత్ రెడ్డి కమిటీ ఇచ్చిన నివేదిక పైన పునఃపరిశీలనకు వేసిన కమిటీ సుందరేషన్ కమిటీ 

సుందరేషన్ కమిటీ కూడా జై భారత్ రెడ్డి కమిటీ నివేదికను సమర్ధించింది.

పై రెండు కమిటీల సూచనల మేరకు ఎన్టీఆర్ ప్రభుత్వం December 30, 1985 న 610 జీవో ను విడుదల చేశారు


610 జీవో (610 G.O) 

March 31, 1986 లోపు తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాలు పొందిన స్థానికేతరులను తిరిగి వారి స్వస్థలాలకు పంపాలని తెలుపుతుంది 

స్థానికేతరులను వారి స్వస్థలానికి పంపగా ఏర్పడిన ఖాళీలను తెలంగాణ వారితో భర్తీ చేయాలని పేర్కొంది


564 జీవో (564 G.O) 

రాయలసీమ ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్న స్థానికేతరులు అయిన కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారిని తిరిగి స్వస్థలాలకు పంపేందుకు జీవో 564 డిపార్ట్మెంట్,  05 December 1985 న విడుదలైంది. 

Note: దీనిని మాత్రం సక్రమంగా అమలు చేసారు కానీ 610 G.O ని మాత్రం పక్కన పడవేశారు.