Kakatiya Dynsty Study Material in Telugu కాకతీయులు 2

తొలి కాకతీయులు Kakatiya Kings History in Telugu

1వ బేతరాజు (క్రీ.శ. 995-1052)

  • ఇతను పశ్చిమ చాళుక్యుల సామంతుడు  
  • ఇతను రాజ్యాన్ని అనుమకొండను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు 
  • ఇతని యొక్క బిరుదులు కాకతి పునాదినాథ, చోడక్ష్మపాల 
  • ఇతనికి సంరక్షకులుగా (మేనత్త) కామసాని  మరియు విరియాల ఎర్ర భూపతి ఉండేవారు. 
  • ఇతని మంత్రి నారాయణయ్య జీనాలయమునకు మరమత్తులు చేయించి 'శనిగరం శాసనం' వేయించాడు.

1వ ప్రోలరాజు (క్రీ.శ.1052-1076)

  • ఇతను కూడా శనిగరం శాసనం వేయించాడు. 
  • ఇతని యొక్క బిరుదులు అరిగజకేసరి, కాకతి వల్లభ, సమదీగతపంచమశబ్ద
  • ఇతను కేసముద్రం, జగత్ కేసరి సముద్రం చెరువులను త్రవ్వించాడు. 
  • ఇతను వరాహ చిహ్నంతో నాణెములను ముద్రించినాడు. 

2వ బేతరాజు (క్రీ.శ.1076-1108)

  • ఇతనియొక్క బిరుదులు విక్రమచక్రి, మహామండలేశ్వర, త్రిభువనమల్ల, చలమర్తిగండ 
  • ఇతను వేయించిన శాసనం మరియు దీని ప్రకారం ఇతనొక గొప్ప యుద్ధ వీరుడు. 
  • ఇతను రామేశ్వర పండితుని దగ్గర శైవ దీక్షను పొందాడు. 
  • ఇతను హనుమకొండలో బేతేశ్వరాలయమును నిర్మించాడు. 

దుర్గరాజు (క్రీ.శ.1108-1116)

  • ఇతని యొక్క బిరుదులు త్రిభువనమల్ల, చలమర్తిగండ 
  • ఇతను అనుమకొండ బేతేశ్వరాలయాన్ని రామేశ్వర పండితునికి దానం చేశాడు. 

2వ ప్రోలరాజు (క్రీ.శ.1116-1158)

  • ఇతని యొక్క బిరుదు మహామండలేశ్వర, దారిద్ర్య విద్రావణ 
  • ఇతను తోలి కాకతీయులలో గొప్పవాడు. 
  • ఇతని కాలంలోనే ఓరుగల్లు కోటను ప్రారంభించారు. 
  • ఇతని భార్య పేరు ముక్కమాంబ, ఈమె నటవాడి పాలకుడు దుర్గరాజు సోదరి 
  • ఇతను శ్రీశైలం లో విజయ స్తంభాన్ని నాటాడు 
  • 3వ సోమేశ్వరుడు మరణానంతరం కళ్యాణి చాళుక్య రాజ్యం పతనమైంది. ఈ పతనం తరువాత రుద్రదేవుడు స్వతంత్రం ప్రకటించుకున్నాడు.
Previous..                                                                          Continue..