KCR Hunger Strike for Telangana - కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష

KCR Hunger Strike for Telangana - కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష

కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష :

  • ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమని KCR ప్రకటించి November 29, 2009 నుండి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నాడు. 
  • కెసిఆర్ దీక్ష స్థలం -రంగదాంపల్లి (సిద్దిపేట)
  • November 29న  KCR కరీంనగర్ నుండి రంగదాంపల్లి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు 
  • కెసిఆర్ ఖమ్మం జైలులోనే దీక్ష ప్రారంభించారు. 
  • ఈ పరిణామాల వల్ల "శ్రీకాంతాచారి" అనే యువకుడు L.B. NAGAR చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. 
  • 2009 డిసెంబర్ 4న శ్రీకాంతాచారి అమరుడయ్యిండు. 
  • ఈ ఉద్యమ తీవ్రతను గ్రహించిన ముఖ్యమంత్రి రోశయ్య 7th డిసెంబర్ 2009న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాడు.
  • ఈ సమావేశానికి తొమ్మిది రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. 
  • December 7న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు మద్దతు పలికాడు. 
  • మొదటి నుండి సమైక్యాంధ్రకు అనుకూల మైన MIM, సీపీఐ(ఎం) తప్ప మిగిలిన పార్టీలు అన్ని తెలంగాణకు మద్దతు ఇచ్చాయి 
  • 2009 డిసెంబర్ 8న నీమ్స్ సూపరిండెంట్ ప్రసాదరావు KCR దీక్ష విరమించకపోతే జీవితం ప్రమాదంలో పడుతుందని ప్రకటన విడుదల చేశాడు. 
  • December 9 నాడు ప్రధానమంత్రి రష్యాలో, ప్రణబ్ ముఖర్జీ విదేశీ పర్యటనలో ఉన్నారు. 
  • దాంతో 9th December 2009  నాడు కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రకటన ఏవిధంగా ఉండాలి అనే విషయంపై ప్రొఫెసర్ జయశంకర్ సార్ తో చర్చించాడు. 
  • అనంతరం 2009 Decemebr 9 రాత్రి 11:30 గంటలకు హోం మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటుపై ఈ క్రింది విధంగా ప్రకటన జారీ చేశాడు.
  • మొదటి ప్రకటన - "తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెడతారు" అని చిదంబరం పేర్కొన్నారు. 
  • తెలంగాణ ఏర్పాటుపై చిదంబర ప్రకటన అనంతరం KCR తో ప్రొఫెసర్ జయశంకర్ సార్ నిరాహార దీక్ష విరమింపజేసినాడు.
  • తరువాత ఆంధ్రా లో జరిగిన సంఘటనల ఫలితంగా తిరిగి కేంద్ర హోం మంత్రి చిదంబరం December 23న మరొక ప్రకటనలు జారీ చేశారు. 
  • రెండవ ప్రకటన - "అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం".