ఆపరేషన్ పోలో-1948 సెప్టెంబర్ 13-17 Operation Polo నిజాం పాలన అంతం
సైనిక రహస్య పత్రాలు దీనిని ఆపరేషన్ కాటర్ పిల్లర్ గా పేర్కొంటారు.
దీన్ని రూపొందించినవారు - ఈ ఎన్ గోడార్డ్
భారత సైన్యం హైదరాబాద్ లోకి ప్రవేశించి హైదరాబాద్ సంస్థానంలోని POLO గ్రౌండ్స్ లో తన ఆధీనంలోకి తీసుకొని అక్కడి నుండి కార్యకలాపాలు నిర్వహించడం వల్ల ఆపరేషన్ POLO అని పేరు వచ్చింది.
అప్పటి ప్రధాన సైన్యాధిపతి - సర్ రాయ్ బౌచర్
అప్పటి రక్షణ మంత్రి - బల్దేవ్ సింగ్
ఈ ప్రణాళిక ప్రకారం హైదరాబాద్ పై దాడి చేయుటకు నిర్ణయించిన భారత ప్రభుత్వం ఈ దాడి ప్రణాళికను అమలు చేసే బాధ్యత అప్పటి SOUTH కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజేంద్ర సింగ్ జడేజాజీ కు అప్పగించింది
తక్షణమే రాజేంద్ర సింగ్ జడేజాజీ సైన్యాన్ని, ప్రధానంగా మూడు (3) యూనిట్లుగా విభజించి వాటిని షోలాపూర్ విజయవాడ పంపాడు.
- షోలాపూర్ - జె.ఎన్.చౌదరి
- విజయవాడ - ఏ ఏ రుద్ర
- బీరార్/హాస్పెట - శివదత్తు సింగ్
యుద్ధ విమానాల ద్వారా దాడి చేయడానికి పూణే ఎయిర్బేస్ ను ఉపయోగించారు
భారత సైనిక దాడులు కదలికలు తెలుసుకున్న ఉస్మాన్ అలీఖాన్ తక్షణమే మెహదీ నవాజ్ ద్వారా 1948 SEPTEMBER 10 న భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేశాడు.
ఐక్యరాజ్యసమితిలో హైదరాబాద్ ప్రభుత్వానికి సహకరించుటకు నియమించబడిన వ్యక్తి Sir వాల్టర్ మాంక్తంన్ .
దీన్ని గమనించిన భారత ప్రభుత్వం అదే రోజు SEPTEMBER 10న ఉస్మాన్ అలీఖాన్ కు మూడు రోజులు గడువు ఇస్తూ K.M.మున్షీ చేత చివరి హెచ్చరికను జారీ చేసింది.
కానీ ఉస్మాన్ అలీఖాన్ ఈ దాడిని ఐక్యరాజ్యసమితి అడ్డుకుంటుందని మున్షీ చేసిన హెచ్చరికను కూడా పట్టించుకోలేదు.
ఉస్మాన్ అలీ ఖాన్ నుంచి స్పందన రాకపోవడంతో భారత ప్రభుత్వం 1948 SEPTEMBER 13 తెల్లవారుజామున 4 గంటలకు అన్ని వైపుల నుండి ఏకకాలంలో భారత సైనిక దాడులు ప్రారంభమయ్యాయి.
SEPTEMBER 17 నాటికి భారత సైన్యం హైదరాబాద్ నడిబొడ్డులో కి ప్రవేశించింది.
1948 SEPTEMBER 17 సాయంత్రం 5 గంటలకు ఉస్మాన్ అలీఖాన్ రేడియోలో ఉపన్యాసం చేస్తూ హైదరాబాద్ భారతదేశంలో అంతర్భాగం అయిందని హైదరాబాద్ ప్రజలు ఎవరూ కూడా భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయవద్దని ప్రకటించాడు.
ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క రేడియో ప్రకటనతో భారతదేశ సైనిక దాడి నిలిచిపోయింది.
ఉస్మాన్ అలీఖాన్ లాయక్ అలీ ని ప్రధాని పదవి నుంచి తొలగించి ఒక కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు
ఆ విధంగా 1948 SEPTEMBER 17న నిజాం పాలన అంతమై హైదరాబాద్ భారత యూనియన్ లో విలీనమైంది.
హైదరాబాదులో J.N.చౌదరి సైనిక మిలటరీ గవర్నర్ జనరల్ గా నియమించబడ్డాడు.
1948 SEPTEMBER 22న ఉస్మాన్ అలీ ఖాన్ తాను ఐక్యరాజ్యసమితిలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నాడు.
నిజాం పాలన అంతం పై ఈ క్రింది పుస్తకాలు రచించారు
1. ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ - లాయక్ అలీ
2. ద ఎండ్ అఫ్ యాన్ ఎరా - కె ఎం మున్షీ
ఆపరేషన్ POLO దాని అనంతరం చోటు చేసుకున్న సంఘటనల గురుంచి తెలుసుకొనుటకు కేంద్రం పండిట్ సుందర్ లాల్ కమిటీని నియమించింది.
For Job Notifications CLICK HERE TSPSC WEBSITE CLICK HERE