Revivalism of Telangana Culture - తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం
తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం
తెలంగాణ అమరవీరుల స్థూపం (Telangana Martyr Statue)
- 1969 తెలంగాణ ఉద్యమంలో అమరులైనవారి స్మృత్యర్థం (In Memory) గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మించారు
- ఈ స్తూపాన్ని చెక్కిన శిల్పి- ఎక్కా యాదగిరి
- అమరవీరుల స్తూపం అడుగుభాగం నల్ల రాయితో తయారు చేశారు
- నాలుగు వైపులా తొమ్మిది చొప్పున చిన్న రంధ్రాలు ఉన్నాయి. ఇది అమరవీరుల శరీరంలో దూసుకుపోయిన బుల్లెట్స్
- స్థూపాన్ని ఎరుపు రాయి తో నిర్మించారు. ఇది త్యాగానికి, సాహసానికి నిదర్శనం
- స్థూపం మధ్య భాగంలో ఒక స్థంభం ఉంటుంది. ఏ వైపు చూసినా దానిపై 9 గీతలు కనిపిస్తాయి. ఇది తొమ్మిది జిల్లాలకు నిదర్శనం
- పై భాగంలో అశోకుని ధర్మచక్రం ఉంటుంది. ఇది ధర్మం, శాంతి, సహనానికి గుర్తు.
తెలంగాణ తల్లి విగ్రహం (Telangana Talli Statue)
- తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించడంలో ముఖ్య పాత్ర పోషించిన వారు B.N. రాములు, బి.వి.ఆర్ చారి, ప్రొఫెసర్ గంగాధర్
- పసునూరి దయాకర్ తయారుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ భవన్ లో 2007 November 15న కేసీఆర్ ఆవిష్కరించారు.
ఈ విగ్రహం ప్రత్యేకతలు
- కిరీటంలో మరియు వడ్డానం లో ప్రసిద్ధి చెందిన కోహినూరు మరియు జాకబ్ వజ్రాలను పోలి ఉంటాయి
- పట్టుచీర - పోచంపల్లి, గద్వాల చీరలకు గుర్తుగా
- కాలి మెట్టెలు - ముత్తయిదువుకు చిహ్నంగా
- వెండి మెట్టలు - కరీంనగర్ ఫిలిగ్రీ ఆభరణాలకు చిహ్నంగా
- చేతిలో మొక్కజొన్న - తెలంగాణ మెట్ట ప్రాంతాలకు గుర్తుగా
- ఇంకో చేతిలో బతుకమ్మ - తెలంగాణ పండుగకు గుర్తుగా.
తెలంగాణ జాగృతి (Telangana Jagruthi)
- తెలంగాణ ప్రాంతంలోని సంస్కృతి, కళా రూపాల, సాహిత్యం, జానపదులు మరియు తెలంగాణ ప్రాంతం మాండలికం మొదలైనవి పరిరక్షించడానికి "తెలంగాణ జాగృతి సాంఘిక-సాంస్కృతిక సంస్థ" June 2008లో ఏర్పడింది
- దీనిని కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసింది.
- పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించడానికి తెలంగాణ జాగృతి బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రతిసంవత్సరం నిర్వహిస్తుంది
- తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాల్లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించి, వాటికి విశిష్ట ముగింపుగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ పై లక్షలాది మంది ప్రజలతో బతుకమ్మ పండుగ జరిపి సాంస్కృతిక కవాతు నిర్వహిస్తారు.