తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా వివిధ ప్రాంతాలలో జరిగిన సభలు-సమావేశాలు.
గొల్లపల్లి సభ (Gollapally Sabha)
August 17, 1977న జగిత్యాల తాలూకాలోని గొల్లపల్లి గ్రామంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది.
ఈ సమావేశ తీర్మానాలు: రైతుల జీవన పరిస్థితి మెరుగు పడాలి దున్నేవాడికే భూమి చెందాలి
తిమ్మాపూర్ సంఘటన (Timmapur Incident in Telangana)
తిమ్మాపూర్ గ్రామంలో సిపిఐ (M L) కార్యకర్త అయిన లక్ష్మీరాజ్యం, ఖానాపూర్ గ్రామంలో తన పార్టీ కార్యకర్త పోసెట్టి ని చంపి వేయడం జరిగింది
దీంతో తమ నాయకులకు 1977 November నుండి 1978 ఏప్రిల్ వరకు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని అనేక గ్రామాల్లో బహిరంగ సభలు, ప్రదర్శనలు జరిగాయి
ముద్దు నూరు సంఘటన (Muddunoor Incident in Telangana)
ముద్దు నూరు భూస్వామి రాజేశ్వరరావు ఇతని దగ్గర పనిచేయుచున్న పాలేరులు, వ్యవసాయ కూలీలు తమ జీతాలు కూలీ రేట్లు పెంచాలని సమ్మె ప్రారంభించారు
ఇతనికి రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో టేకు చెట్ల తోట ఉండేది.
1978 June 30న చుట్టుపక్కల ఆరు గ్రామాల ప్రజలు సుమారు 500 బండ్లు కట్టుకొని ఇతని ప్రాంతంలోని చెట్లు నరికి తీసుకొని వెళ్ళిపోయారు. ఈ సంఘటన జగిత్యాల జైత్రయాత్రకు నాంది గా పేర్కొన వచ్చును
మంథని సంఘటన (Manthani Incident in Telangana)
మంథని తాలూకాలో తునికాకు కూలీలు కాంట్రాక్టర్లకు మరియు అటవీ శాఖ అధికారులకు వ్యతిరేకంగా సమ్మె చేశారు
అటవీశాఖ అధికారులు మరియు కాంట్రాక్టర్లు ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నించినప్పటికీ విచ్చిన్నం చేయలేకపోయారు
జగిత్యాల జైత్రయాత్ర (Jagital Jaitra Yatra)
1978 సెప్టెంబర్ 7న జగిత్యాల పట్టణంలో సిపిఐ(M.L) ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన రైతుకూలి ప్రదర్శన జరిగింది
ఈ ప్రదర్శనకు జగిత్యాల తాలూకాలోని దాదాపు 150 గ్రామాల నుండి రైతు కూలీలు హాజరయ్యారు
ఈ సమావేశ తీర్మానాలు:
i) దున్నేవారికి భూమి చెందాలి
ii) వ్యవసాయ విప్లవాన్ని విజయవంతం చేసుకోవాలి
iii) నూతన ప్రజాస్వామ్య వ్యవస్థను రూపొందించుకోవాలి
చిన్న మెట్పల్లి లో September 14న రైతులు బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సభకు ఊరేగింపుగా వస్తున్న రైతులపై భూస్వామి జగన్మోహన్ రావు కాల్పులు జరిపారు
ఈ కాల్పులకు నిరసనగా సిపిఐ(M.L) పౌరహక్కుల సంఘం రైతుకూలీ సంఘాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 18, 1978న నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చాయి
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
దీంతో October 20, 1978 జగిత్యాల, సిరిసిల్ల తాలూకాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించారు
ఇంద్రవెల్లి సభ (Indravelli Sabha)
రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో 1981 April 20న ఇంద్రవెల్లిలో మహాసభ జరిగింది
మొదట్లో ప్రభుత్వం ఈ సభకు అనుమతి ఇచ్చి ఆ తరువాత అనుమతి నిరాకరించింది
ఈ సభకు హాజరు అవుతున్న గిరిజనులపై పోలీసుల కాల్పులు జరిపారు, దీంతో ఇంద్రవెల్లి గిరిజన రక్తసిక్తమైంది
ఇంద్రవెల్లిలో ప్రాణాలర్పించిన గిరిజన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి ఇక్కడ అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత 1987 లో ఈ అమరవీరుల స్థూపాన్ని కూల్చివేయడం జరిగింది