Students Role in Telangana Movement-తెలంగాణ ఉద్యమం విద్యార్థులు

Students Role in Telangana Movement - తెలంగాణ ఉద్యమం విద్యార్థులు 

తెలంగాణ ఉద్యమం - విద్యార్థులు 

  • 1952లో చేపట్టిన  గైర్ ముల్కీ ఉద్యమంలో, 1969లో చేసినా తెలంగాణ తొలి దశ ఉద్యమంలో, 1996 అనంతరం చేపట్టిన మలిదశ ఉద్యమంలో అనేక విద్యార్థి సంఘాలు పోరాడి 2014 JUNE 2 న తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు విద్యార్థులు కీలకపాత్ర పోషించారు 
  • 2009 NOVEMBER 1న తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు 'తెలంగాణ విద్రోహదినం' పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు 
  • KCR ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తరువాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం పూర్తిగా విద్యార్థుల చేతుల్లోకి వెళ్లింది
  • 2009 డిసెంబర్ 10న 'చలో అసెంబ్లీ' కి పిలుపునిచ్చారు. కానీ 2009 DECEMBER 9 అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రకటించడంతో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.

విద్యార్థుల ఆమరణ దీక్ష 

  • 2009 DECEMBER 24న ఓయూ లోని ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో 18 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.

ఓయూ విద్యార్థి గర్జన 

  • రాజకీయంగా రెండు పరస్పర విరుద్ధ ప్రకటనలు రావటంతో రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు 2010 JANUARY 3న విద్యార్థి జేఏసీ ఓయూలో విద్యార్థి గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. 
  • 2010 January 8న తెలుగు విశ్వవిద్యాలయంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు.

విద్యార్థుల రణభేరి 

  • 2010 జనవరి 23న నిజాం కాలేజి గ్రౌండ్ లో ABVP విద్యార్థి రణభేరి పేరుతో సభను నిర్వహించారు
  • ఈ సభకు ముఖ్య అతిథిగా సుష్మాస్వరాజ్ హాజరయ్యారు.

విద్యార్థి పొలికేక సభ 

  • తెలంగాణ ప్రజలను చైతన్యం చేయడం కోసం విద్యార్థులు చేపట్టిన పాదయాత్ర వరంగల్ లో 2010 FEBRUARY 7న ముగింపు సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో 'విద్యార్థి పొలికేక' సభ జరిగింది  OU విద్యార్థి ఐకాస 2010 FEBRUARY 21న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది.
  • తెలంగాణ రాజకీయ JAC రెండు విడతలుగా బస్సు యాత్రను నిర్వహించింది. 
  • మొదటి విడతగా 2010 MARCH 21 నుండి 23 వరకు గన్ పార్క్ నుండి హనుమకొండ వరకు సాగింది. 
  • రెండో విడత కొమరవెల్లి నుంచి మంచిర్యాల వరకు 2017 April 9th నుండి 12th వరకు నిర్వహించింది. 
  • 2010 May 28న వరంగల్ జిల్లాలోని మానుకోట వద్ద జగన్ నిర్వహించిన ఓదార్పు యాత్రను తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్నారు. 
  • ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 2011 July 11న OUలో విద్యార్థుల సామూహిక నిరాహార దీక్షలు ప్రారంభించారు.
  • 2013 January 24న Kakatiya యూనివర్సిటీ లో తెలంగాణ విద్యార్థి బహిరంగ సభను నిర్వహించారు.
  • 2013 June 14న నిర్వహించబడిన 'చలో అసెంబ్లీ' కార్యక్రమంలో విద్యార్థులే అసెంబ్లీకి చేరి తెలంగాణ నినాదాలు చేశారు.