Suicides for Telangana - మలిదశలో తెలంగాణ కోసం ఆత్మహత్యలు

Suicides for Telangana - మలిదశలో తెలంగాణ కోసం ఆత్మహత్యలు 

మలిదశలో తెలంగాణ కోసం ఆత్మహత్యలు

  • తెలంగాణాలో ఆత్మహత్యలపై ప్రచురించబడిన పుస్తకం - తెలంగాణ మూవ్ మెంట్ సుసైడ్స్, సాక్రిఫైసిస్ మరియు మార్టర్స్. 
  • నిజామాబాద్ జిల్లా బిక్నూర్ మండలంలోని శివాయిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ కిష్టయ్య 2009 December 1న తన యొక్క సర్వీస్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
  • 2009 November 29న KCR అరెస్టుతో మనస్తాపానికి గురైన శ్రీకాంతాచారి అనే విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మబలిదానానికి సిద్ధమయ్యారు ఇతను డిసెంబర్ 3వ తేదీన అంతిమ శ్వాస విడిచాడు. ఇతను నల్గొండ జిల్లాలోని మోత్కురు గ్రామానికి చెందిన వ్యక్తి. .  
  • 2010 January 19న ఓయూ విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. 
  • తెలంగాణ ఉద్యమ తీవ్రత గురించి ఢిల్లీకి తెలియజేయాలని Delhiలో పార్లమెంటు ముందు ఆత్మహత్య చేసుకున్న యువకుడు యాదిరెడ్డి. ఇతను రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మంగళారం గ్రామానికి చెందిన వ్యక్తి. 
  • 2010 February 20న 'చలో అసెంబ్లీ' కార్యక్రమం సమయంలో సిరిపురం యాదయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను రంగారెడ్డి జిల్లా మహేశ్వరపురం మండలం నాగారం గ్రామానికి చెందిన వ్యక్తి. 
  • అసెంబ్లీ ముట్టడి సమయంలో యాదయ్య అనే విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ  NCC గేటు వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. 
  • 2010 January 26 న  అడ్వకేట్ దేవేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. 
  • 2010 July లో ఉప ఎన్నికల ఫలితాల్లో డి. శ్రీనివాస్ ఓడిపోవడంతో తన కోరిక నెరవేరిందని ISHAN REDDY ఆత్మబలిదానం చేసుకున్నాడు. ISHAN REDDY మెదక్  జిల్లా న్యాలకల్  మండలం బసంతపురం గ్రామానికి చెందిన వ్యక్తి. 
  • 2012 Marchలో సిరిపురం శ్రీకాంత్ అనే విద్యార్థి హైదరాబాదులో మరణించాడు. 
  • లూనావత్  భోజ్యానాయక్ (వరంగల్ జిల్లా) అనే అతను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యం మరియు స్థానిక టిడిపి కాంగ్రెస్ నేతల తీరుపై కలతచెంది 'ఐ వాంట్ తెలంగాణ జై తెలంగాణ' అంటూ నినాదాలు చేస్తూ హనుమకొండలోని సుబేదారి వద్ద 2012 March 23న పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.