Telangana Bill In AP Assembly- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు  Telangana State Formation Bill in Andhra Pradesh Assembly 

  • 2013 డిసెంబర్ 12న బిల్లు రాష్ట్రానికి చేరింది 
  • బిల్లుపై అభిప్రాయం చెప్పడానికి రాష్ట్రపతి ఇచ్చిన సమయం ఆరు వారాలు 
  • 2013 December 16న బిల్లుపై డిప్యూటీ స్పీకర్ 'మల్లు భట్టి విక్రమార్క' చర్చను ప్రారంభించారు 
  • సభలో గందరగోళం పరిస్థితి ఏర్పడటంతో సభ వాయిదా పడింది 
  • ముఖ్యమంత్రి మాత్రం బిల్లుపై చర్చ మొదలు కాలేదని పేర్కొన్నారు 
  • December 16న అసెంబ్లీలో బిల్లుపై చర్చ ప్రారంభమైందని శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు 
  • 2013 December 19న తొలి విడత సమావేశాలు వాయిదా పడ్డాయి 
  • 2013 December 31 న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబును శాసన సభ వ్యవహారాల శాఖ బాధ్యతల నుంచి తొలగించి మరొక మంత్రి శైలజానాథ్ కు  ఆ శాఖ బాధ్యతలు అప్పగించడం జరిగింది 
  • సీఎం చర్యలకు నిరసనగా 2014 January 2న శ్రీధర్ బాబు మంత్రి పదవికి రాజీనామా చేశాడు 
  • 2014 జనవరి 3న శాసనసభ మలివిడత సమావేశాలు మొదలయ్యాయి 
  • 2014 January 6న అక్బరుద్దీన్ (MIM) అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రారంభమైనట్లు ప్రకటించాడు 
  • 2014 January 8న బిల్లుపై రాష్ట్ర శాసనసభలో తొలి ప్రసంగం చేసిన వ్యక్తి మంత్రి - వట్టి వసంత కుమార్ 
  • 2014 January 10న టిఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ బిల్లుపై ప్రసంగించారు 
  • 2014 January 22న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నానని ప్రసంగించాడు. 
  • 2014 January 23న ఒక వారం గడువు పెంచమని రాష్ట్రపతికి లేఖ పంపారు.  
  • 2014 January 22న ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా బిల్లుపై ప్రసంగించాడు  
  • ముఖ్యమంత్రి రూల్ 77 కింద బిల్లును వెనక్కి పంపాలని స్పీకర్ కు తీర్మానంనోటీసు ఇచ్చారు 
  • రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పంపిన బిల్లుపై శాసనసభ అభిప్రాయాలు మాత్రమే చెప్పాలి 
  • బిల్లును తిరస్కరించి మరియు వెనక్కి పంపే అధికారం అసెంబ్లీకి లేదు ఓటింగ్ కు  కూడా అవకాశం లేదు 
  • 2014 జనవరి 30న సభలో 87 మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. మిగిలిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను రాతపూర్వకంగా ఇచ్చారు. దీంతో సభ్యులు అభిప్రాయం రికార్డు అయ్యింది. బిల్లుపై చర్చ ముగిసిందని స్పీకర్ ప్రకటించారు.  
  • ఈ ప్రకటన అనంతరం రూల్ 77 కింద ముఖ్యమంత్రి ఇచ్చిన తీర్మానంలో సభలో ఓటింగ్ కు తీసుకుంటున్నాను అని స్పీకర్ ప్రకటించాడు. 
  • ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును తిప్పి పంపుట కొరకు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదించారు.  
  • 2014 February 4న రాష్ట్ర అసెంబ్లీ పంపిన అభిప్రాయాలకు జివోఎం ఆమోదం తెలిపింది 
  • 2014 February 7న తెలంగాణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది 

  • 2014February 9న బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరుకుంది.
  • పార్లమెంటు సమావేశాలు మొదలైన తర్వాత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన కాంగ్రెస్ MPలు 

  1. లగడపాటి రాజగోపాల్ 
  2. రాయపాటి సాంబశివరావు 
  3. హర్ష కుమార్ 
  4. సబ్బం హరి 
  5. సాయి ప్రతాప్ 
  6. ఉండవల్లి అరుణ్ కుమార్ 

  • 2014 ఫిబ్రవరి 11న అవిశ్వాసం పెట్టిన MPలను కాంగ్రెస్ అధిష్టానం పార్టీ నుండి సస్పెండ్ చేసింది