Telangana Movement Between 1970 నుంచి 2000
1970 నుంచి 2000 వరకు తెలంగాణ ఉద్యమం
1973 నుండి 1983 మధ్య కాలంలో ఒక దశాబ్ద కాలం పాటు తెలంగాణ ఉద్యమకారులు స్తబ్దంగా ఉన్నప్పటికీని తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ప్రత్యేక తెలంగాణ వాదుల్లో కదలికలు రావడం
1984 నుంచి ప్రారంభమైన మలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని అధ్యయనం చేయడానికి 3 దశలుగా విభజించవచ్చు
నిర్మాణ పూర్వదశ 1984-1996
నిర్మాణ దశ 1996-2001
రాజకీయ ప్రక్రియ దశ 2001-2014
1983లో జరిగిన హిమాయత్ నగర్ ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి అయిన ఉపేంద్ర BJP అభ్యర్థి అయిన అలె నరేంద్ర తెలంగాణ వారి మద్దతుతో విజయం సాధించారు. ఉపేంద్ర ఓటమితో తెలంగాణవాదుల్లో కొత్త ఉత్సాహం ఏర్పడింది
నిర్మాణ పూర్వదశ 1984-1996
తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్(Telangana Democratic Front)
హిమాయత్ నగర్ ఎన్నికల్లో P. ఉపేంద్ర ఓటమి పొందడంతో సంతోషించిన తెలంగాణవాదులు YMCA హాలులో ఈ సదస్సును నిర్వహించారు.
దీనికి కన్వీనర్ సత్యనారాయణ
తెలంగాణ పార్టీ
1984వ సంవత్సరంలో దేవా నంద స్వామి వరంగల్ లో తెలంగాణ పార్టీని స్థాపించారు.
తెలంగాణ జనసభ
ఇది కూడా సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పడింది.
తెలంగాణ జనసభ 07-02-1985 న ఆంధ్ర సారస్వత పరిషత్ హాలులో పెద్ద సదస్సును నిర్వహించింది.
తెలంగాణ జనసభ నాయకులు కొత్తగూడెం మరియు వరంగల్ పట్టణాల్లో సభలు నిర్వహించారు.
ఈ సభలోని నాయకులు ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి మరియు హోంమంత్రి వై వి చవాన్ కు వినతి పత్రాలు సమర్పించారు.
ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ
ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో ప్రొఫెసర్ లక్ష్మణ్ అధ్యక్షతన సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వారికి జరుగుతున్న నష్టాల గురించి చర్చించేందుకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా దాశరథి కృష్ణమాచార్యులు.
ఈ సదస్సులో ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ (OU Forum for Telangana) అనే ప్రజా సంఘం ఏర్పడింది. దీనికి అధ్యక్షులుగా ప్రొఫెసర్ జి లక్ష్మణ్ ఎంపికయ్యారు.
ఇది నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ మ్యాప్ తో కూడిన మా తెలంగాణ గ్రీటింగ్స్ ను పంపిణీ చేసింది.
ఇది తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తో కలిసి కాళోజీ చేతుల మీదుగా తెలంగాణ పొలిటికల్ మ్యాప్ ను విడుదల చేసింది.
ఈ ఫోరం సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినంగా, November 01ని తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తూ కొన్ని సంవత్సరాలపాటు ఉస్మానియా యూనివర్సిటీలో అవగాహన సదస్సులు నిర్వహించింది.
తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్
T.ప్రభాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 1988 July 14 న ఏర్పడింది
దీనిలోని సభ్యులు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రభాకర్ రావు మరియు హరినాథ్.
దీని యొక్క లక్ష్యాలు
1) తెలంగాణ అన్యాయాలపై పరిశోధన
2) ఈ అన్యాయాలకు సంబంధించిన ప్రచురణలు ముద్రించడం
ఈ ట్రస్ట్ కు సంబంధించిన పత్రిక మా తెలంగాణ పత్రిక. దీనిని 1989 August 13న కాచిగూడలోని బసంత్ టాకీస్ లో ఆవిష్కరించారు.
మా తెలంగాణ ఈ పత్రిక యొక్క ప్రత్యేక సంచికలు (Special Issues of Maa Telangana)
1) 1989లో కల్వకుర్తి ఎన్నికల్లో ఎన్టీఆర్ పోటీ చేసినప్పుడు
2) 1997లో మలిదశ ఉద్యమం ప్రారంభమైనప్పుడు
3) 2001లో టిఆర్ఎస్ ఏర్పడినప్పుడు
తెలంగాణలో జరుగుతున్న దోపిడీపై 1988 లో ముద్రించిన పుస్తకం పర్స్పెక్టివ్ తెలంగాణ (Perspective on Telangana)
తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్
దీనిని 1992లో ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడు మనోహర్ రెడ్డి.
ఈ ఆర్గనైజేషన్ ఉస్మానియా యూనివర్సిటీ మరియు దాని అనుబంధ కాలేజీలలో స్థానిక స్థానికేతర రిజర్వేషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమించారు.
వీరు కళాశాలలో సీట్ల కోసం ఉద్యమం ప్రారంభించిన తరువాత క్రమక్రమంగా తెలంగాణ వారు ఎదుర్కొంటున్న అన్యాయాలను వెలికి తీసింది.
తెలంగాణ ముక్తి మోర్చా
దీనిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన వారు మేచినేని కిషన్ రావు, పురుషోత్తం రెడ్డి, మదన్ మోహన్, CH లక్ష్మయ్య.