Telangana Movement Between 1970 to 2000 - తెలంగాణ విద్యార్థి సంఘాలు

Telangana Movement Between 1970 to 2000 తెలంగాణ విద్యార్థి సంఘాలు 

తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ 

  • ఇది 1998 అక్టోబర్ 14న స్థాపించబడింది 
  • ఇది తెలంగాణ జనసభ అనుబంధ సంస్థ

తెలంగాణ విద్యార్థి సంఘం 

  • 2006 ఆగస్టు 8న స్థాపించబడింది 
  • ఇది 2006 August లో 10 వేల మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభ నిర్వహించింది 
  • దీనికి ముఖ్య అతిధులుగా జార్జ్ ఫెర్నాండేజ్, గద్దర్, రసమయి మరియు సింహాద్రి వంటి నాయకులు హాజరయ్యారు 
  • 2007లో గద్దర్ నాయకత్వంలో జరిగిన మహా సాంస్కృతిక శాంతియాత్ర లో ఈ సంఘం ఖమ్మం జిల్లా మణుగూరు నుండి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి వరకు యాత్ర నిర్వహించింది.

తెలంగాణ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ 

  • 2006 సెప్టెంబర్ లో ప్రొఫెసర్ కోదండరాం సూచన మేరకు P. శంకర్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ లో స్థాపించారు 
  • ఇది 2007 September 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్ కాలేజీ నుంచి భారీ బహిరంగ సభ నిర్వహించింది.

తెలంగాణ విద్యార్థి వేదిక 

  • 2006 అక్టోబర్ 27న ఆవిర్భవించింది. దీనికి అధ్యక్షుడుగా ఉన్న జంజర్ల రమేష్ బాబు మరియు ప్రధాన కార్యదర్శిగా శివకుమార్ నియమించబడ్డారు 
  • ఇది 2006 నవంబర్ 1stన తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ విద్రోహదినం నిర్వహించింది 
  • February 28th, 2008న ఐక్య కార్యాచరణ కమిటీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాలో ఇది పాల్గొన్నది.

తెలంగాణ ఐక్య విద్యార్థి సంఘం 

  • ఇది 2008 January లో వీరగోని చైతన్య గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పడింది 
  • 2nd February, 2008 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఠాకూర్ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్రం వెంటనే ప్రకటించాలని ఒక సదస్సు నిర్వహించింది.


ఇతర అంశాలు 

చర్చా  పత్రిక 

  • దీనిని పిట్టల రవీందర్ 2001లో గోదావరిఖని నుండి ప్రారంభించారు 
  • ఇది ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ మరియు ఖమ్మం నుండి నాలుగు సంవత్సరాలపాటు దినపత్రిక ప్రచురించబడింది.

తెలంగాణ టైమ్స్ 

  • దీనిని 2006 జనవరి నుంచి ప్రచురించడం జరిగింది 
  • దీనికి వర్కింగ్ఎడిటర్ గా నాగోబా మరియు గౌరవ సంపాదకులుగామల్లేపల్లి లక్ష్మయ్య పనిచేశారు
  • ఇది మూడు ప్రత్యేక సంచికలను ప్రచురించింది 
  • అవి 2006 లో 
  • 1) మహిళల ప్రత్యేక సంచిక 2) 2006 June లో '1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సంచిక'  3) 2007 అక్టోబర్ నవంబర్ లో 'పాలమూరు ప్రత్యేక సంచిక'

సహచర బుక్ హౌస్ 

  • దీనిని 1995లో పి.శంకర్ బాగ్ లింగంపల్లిలో స్థాపించారు 
  • ఇది తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు, సీడీలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమగ్రమైన చరిత్ర, సాహిత్యాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర పోషించింది.