Telangana Movement Between 1970 to 2000 - నిర్మాణ దశ 1996-2001

Telangana Movement Between 1970 to 2000నిర్మాణ దశ 1996-2001 

నిజామాబాద్ సభ (Nizamabad Sabha) 

1996 October 27న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ ప్రజాసంఘాల నాయకులు నిజామాబాద్ లో సభను నిర్వహించారు 

ఈ సభలో పాల్గొన్న ముఖ్యనాయకులు కాళోజీ రావు, ప్రొ. జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, భూపతి కృష్ణమూర్తి, గద్దర్ మరియు రఘువీరారావు. 

ఈ సభ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తెలంగాణ ప్రాంతo సమస్యలకు ఏకైక పరిష్కారం అని తీర్మానించింది. 


భువనగిరి సభ(Bhuvanagiri Sabha)

1997 March 8, 9 తేదీలలో ఈ సభ జరిగింది 

ఈ సదస్సు ప్రాంగణానికి "నిజాం వ్యతిరేక పోరాటాలు అమరవీరుల ప్రాంగణం" గా నామకరణం చేశారు 

ఈ సభకు "దగాపడ్డ తెలంగాణ" గా నామకరణం చేశారు 

ఈ సభను కాళోజీ నారాయణ రావు ప్రారంభించారు 

March 9వ తేదీన జరిగిన సభకు నాగారం అంజయ్య అధ్యక్షత వహించారు 

ఈ సభలో వివిధ మేధావులు ప్రసంగించిన భిన్న అంశాలు 

విద్య వైద్య రంగం ప్రొఫెసర్- జయశంకర్ సార్ 

తెలంగాణ వనరులు పారిశ్రామిక కాలుష్యం- ప్రొఫెసర్ జాదవ్ సార్ 

వలసీకరణ ఉద్యోగాలు- ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు 

తెలంగాణ ఉద్యమం అవగాహన-గద్దర్, వెంకటేశ్వర్లు 

భాషా సంస్కృతి మీడియా-నందిని సిద్ధారెడ్డి 

సాంఘిక సంక్షేమ రంగం-ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి 

రిజర్వేషన్లు వర్గీకరణ-డాక్టర్ ముత్తయ్య 

ఆదివాసి సమస్యలు-ప్రొఫెసర్ బాల జనార్ధనరావు 

ఈ రెండు రోజుల సమావేశంలో తన ఉద్యమ పాటలతో బెల్లి లలిత తెలంగాణవాదులులను ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రేరేపించింది


తెలంగాణ మహాసభ(Telangana Mahasabha) 

1997 ఆగస్టు లో తెలంగాణ మహాసభ ఏర్పడింది దీని లో కీలక పాత్ర పోషించింది మారోజు వీరన్న 

11 August 1997న సూర్యాపేటలో "ధోఖాతిన్న తెలంగాణ" పేరుతో సదస్సు జరిగింది 

ఈ సదస్సుకు అధ్యక్షత వహించింది - డా. చెరుకు సుధాకర్

ఈ సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారు -వి ప్రకాష్ 

17 డిమాండ్లతో "సూర్యాపేట డిక్లరేషన్" ను డా. చెరుకు సుధాకర్ ప్రతిపాదించారు 

ఈ సంస్థ ఆధ్వర్యంలో మారోజు వీరన్న తెలంగాణ ఉద్యమంలోకి దళిత మరియు బహుజనులను పెద్ద మొత్తంలో సమీకరించారు 

తరువాత కాలంలో మారోజు వీరన్న ఎన్ కౌంటర్ లో మరణించారు 

తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తెలంగాణ మహాసభ మాస పత్రికను V. ప్రకాష్ వెలువరించారు


ఉద్యమ వేదికలు 

సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్(Center for Telangana Studies)

దీనిని 1997 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్థాపించారు.  

దీనికి అధ్యక్షులు: ప్రొఫెసర్ జయశంకర్ 

ఇది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వివరాలు సేకరించి ప్రచురించి ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకెళ్లింది


తెలంగాణ స్టడీస్ ఫోరం(Telangana Studies Forum) 

దీన్ని 1998లో ఏర్పాటు చేశారు. 

దీనికి అధ్యక్షుడు గాదె ఇన్నయ్య 

ఈ ఫోరం తెలంగాణ సమస్యలపై కరపత్రాలు పుస్తకాలను ముద్రించి ప్రజల్లో అవగాహన చేపట్టింది


తెలంగాణ ఐక్యవేదిక(Telangana Ikya Vedika) 

16 August 1997 న జయశంకర్ సార్ నేతృత్వంలో తెలంగాణ ఐక్యవేదిక ఏర్పడింది 

మొదట్లో ఈ ఐక్యవేదిక కాచిగూడలోని సుప్రభాత కాంప్లెక్స్ లో ఉండేది 

తరువాత కాలంలో ఐక్యవేదిక కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమయిన జలదృశ్యంలోకి మార్చబడింది 

ఈ ఐక్యవేదిక కార్యాలయం 2001లో TRS (తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం) గా మారింది 

తెలంగాణ ఐక్యవేదిక అనేక సదస్సులు సమావేశాలు పెట్టినప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చలేకపోయింది 

తర్వాత కాలంలో KCR తెలంగాణ విషయంలో శ్రద్ధ వహించడం తో తెలంగాణ ఐక్యవేదిక నాయకులైన జయశంకర్ సార్, v. ప్రకాష్ రావు, KCR కు తెలంగాణ ఉద్యమ నాయకత్వ బాధ్యతలు అప్పగించడంతో క్రియాశీలక పాత్ర పోషించారు. 


తెలంగాణ జనసభ (Talangana Janasabha) 

ఉపాధ్యాయులు, లాయర్లు మరియు జర్నలిస్టులు కలిసి తెలంగాణ జన సభను 1998 julyలో హైదరాబాదులోని రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేశారు 

ఈ సభలోనే "జనతెలంగాణ మాస పత్రిక" ను(Jana Telangana Monthly Magazine) కాళోజీ నారాయణరావు ఆవిష్కరించారు 

తెలంగాణ జనసభ అనుబంధంగా జహంగీర్ కన్వీనర్ గా  తెలంగాణ కళా సమితి ఏర్పడింది 

తెలంగాణ కళాసమితికి కో కన్వీనర్ గా ఉన్న బెల్లి లలితను కొంతమంది దుండగులు 1999 May లో భువనగిరిలో హత్య చేశారు


తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (Telangana Development Forum) 

ప్రొఫెసర్ జయశంకర్ సలహాపై 1999లో తెలంగాణ ప్రవాస భారతీయులు దీనిని ప్రారంభించారు 

దీనికి అధ్యక్షుడు మధు కె రెడ్డి 

చైర్మన్ డి పి  రెడ్డి