Telangana Movement Between 1970 to 2000 - రాజకీయ ప్రక్రియ దశ 2001
రాజకీయ ప్రక్రియ దశ 2001 నుంచి
ప్రజా సంఘాలు :
తెలంగాణ విద్యావంతుల వేదిక
- ఇది 2004 మార్చి లో ఏర్పడింది.
- దీనికి అద్యక్షుడుగా కోదండరాం పని చేశారు
తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రచురించిన పుస్తకాలు
- తెలంగాణ అభివృద్ధి మీడియా - వాస్తవం
- తెలంగాణలో చదువు
- కమ్యూనిజమా ? కోస్తావాదమా ?
- తెలంగాణ మిలియన్ మార్చ్
- తెలంగాణ మార్చ్ (సాగరహారం)
- నీళ్లు-నిజాలు
- తెలంగాణ రాజకీయ ఆర్థిక సామాజిక వ్యాసాలు
- ఫ్లోరోసిస్
- భూమిపుండు
- చెదిరిన చెరువు
తెలంగాణ హిస్టరీ సొసైటీ
- 6th June 2006 న హైదరాబాద్ లోని ఫతే మైదాన్ క్లబ్ లో ఒక సమావేశం జరిగింది ఇందులోనే తెలంగాణ హిస్టరీ సొసైటీ ఆవిర్భవించింది
- దీనికి కన్వీనర్ గా తడకమళ్ల వివేక్ నియమించబడ్డారు
- ప్రచురించిన పుస్తకాలు
- ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు-విద్రోహ చరిత్ర
- 1949 ఉద్యమం-చారిత్రిక పత్రాలు
- 17 సెప్టెంబర్ 1948 భిన్న దృక్పోణాలు
- తెలంగాణ చరిత్ర-పునర్నిర్మాణం
- 1857 పోరాట తిరుగుబాటు
తెలంగాణ జన పరిషత్
- దీనినే ప్రజా సంఘాల నాయకులు కేశవరావు జాదవ్ నాయకత్వంలో స్థాపించారు
- నినాదం "ఒకే ఆలోచన, ఒక ఎజెండా ఒకే జెండా"
- తెలంగాణ జన పరిషత్ 18 భాగస్వామ్య సంస్థలతో కలిసి పనిచేసింది
తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి
- సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో 2006 August లో ఇది ఆవిర్భవించింది
- ఇది పాశం యాదగిరి, హనుమాన్లు, చిక్కుడు ప్రభాకర్ మరియు ఆకుల భూమయ్య ల ఆధ్వర్యంలో ఆవిర్భవించింది
- 32 తెలంగాణ ప్రజాసంఘాల ఉద్యమ సంస్థలు దీనిలో భాగస్వామ్యం అయ్యారు
తెలంగాణ సంఘర్షణ సమితి
- సెప్టెంబర్ 28, 2006 లో ఆవిర్భవించింది
- దీనికి అధ్యక్షులు:బెల్లయ్యనాయక్
- ఉపాధ్యక్షుడు-మహమ్మద్ ఇక్బాల్
- ప్రధాన కార్యదర్శి యోగానంద గౌడ్
- ఇది 'భౌగోళిక కాదు సామాజిక తెలంగాణ కావాలి' అనే నినాదంతో ఆవిర్భవించింది
- దీని ఆధ్వర్యంలో పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుండి హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వరకు మహా పాదయాత్ర చేపట్టింది
పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్
- దీనిని 2007 మే నెలలో స్థాపించారు
- స్థాపనలో ముఖ్యులు - సింహాద్రి విశ్వేశ్వరరావు, డాక్టర్ ఎస్ మల్లేష్, డాక్టర్ వై తిరుమల మరియు ప్రొఫెసర్ సత్యనారాయణ తదితరులు
- దీనికి కన్వీనర్ - ప్రొఫెసర్ సింహాద్రి
- కో కన్వీనర్ - భంగ్య భూక్య
తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్
- ఇది 2008 March 1 & 2 తేదీలలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆవిర్భవించింది
- దీనికి అధ్యక్షుడు - ప్రొఫెసర్ జి వెంకటరాజు
- ఉపాధ్యక్షుడు - ప్రొఫెసర్ సయ్యద్ ఆయబ్ అలీ, ప్రొఫెసర్ సుధారాణి
- జనరల్ సెక్రటరీగా మీ సదానందం ఎంపికయ్యారు
- ఇది తెలంగాణకు సంబంధించిన పండుగలు, ఉత్సవాల మరియు మరుగున పడుతున్న విషయాలను తిరిగి ప్రచురించాలనే ఉద్దేశంతో పని చేశాయి
తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్
- దీనిని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో October 18, 2008 లో ఏర్పాటు చేశారు
- ఇది కే శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో ఆవిర్భవించింది
- ఇది నిజాం కాలేజీ గ్రౌండ్స్లో February 1st, 2009న బహిరంగ సభ నిర్వహించింది
- దీనికి ముఖ్య అతిధులుగా ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ రామబ్రహ్మం మరియు చిత్తారి రాఘవులు హాజరయ్యారు
తెలంగాణ విశ్వవిద్యాలయం అధ్యాపకుల వేదిక
- దీనిని November 26, 2008న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఐ పి యస్ ఆర్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేశారు
- దీనికి అధ్యక్షులుగా ఆ రమేష్ రెడ్డి ఎంపికయ్యారు