Telangana Movement Between 1970 to 2000 - తెలంగాణ ఉద్యోగుల సంఘాలు
తెలంగాణ ఉద్యోగుల సంఘాలు
తెలంగాణ ఎన్జీవో సంఘం:
- ఇది 1946 లో నిజాం స్టేట్ లో ములాజిం యూనియన్ పేరుతో స్థాపితమైంది
- ఈ సంఘానికి ప్రథమ అధ్యక్షులు అబ్దుల్ గఫ్ఫార్ హుస్సేన్
- ఇది 1967లో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ గా మార్చబడింది
- 1969 ఉద్యమంలో KR ఆమోస్, స్వామినాథన్ ఆధ్వర్యంలో కీలక పాత్ర పోషించింది
- 2009 October 21st న సిద్దిపేటలో లక్షలాది ఉద్యోగుల గర్జన నిర్వహించింది
తెలంగాణ ఉద్యోగుల సంఘం:
- 2001 జూలై 25న ఆవిర్భవించింది
- దీనికి అధ్యక్షుడుగా విఠల్ ఎన్నికయ్యారు
- ఇది 2004 నుంచి తెలంగాణ డైరీని ఆవిష్కరిస్తుంది
- 2006లో 'క్విట్ తెలంగాణ ఉద్యమాన్ని' నిర్వహించింది
- దీనికి 2002 నుండి 2005 వరకు A.కృష్ణా రెడ్డి అధ్యక్షులు ఆ తరువాత D.సుధాకర్, స్వామిగౌడ్ మరియు దేవీప్రసాద్ అధ్యక్షులు గా కొనసాగారు. ప్రస్తుతం కారం రవీందర్రెడ్డి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం:
- 31st May 2004న బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో అల్లం నారాయణ నాయకత్వంలో స్థాపించబడింది
- తెలంగాణ పాత్రికేయులు రాసిన వ్యాసాలన్నిటిని అల్లం నారాయణ మరియు కందుకూరి రమేష్ సంపాదకత్వంలో 2001 మే లో 'మే 31' అనే పేరుతో పుస్తకరూపంలో తీసుకువచ్చారు
తెలంగాణ టీచర్స్ ఫోరం:
- 20 September, 2006న సెయింట్ పీటర్స్ హై స్కూల్ లో ఇది స్థాపించబడింది
- G. శ్రీధర్ కన్వీనర్ గా తెలంగాణ టీచర్స్ ఫోరం తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించబడ్డారు
తెలంగాణ ఐటీ ఫోరం :
- ఆర్ట్స్ కాలేజీలో 2006లో దీనిని స్థాపించారు
- ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడంతో పాటు విప్రో, సత్యం, హైటెక్ సిటీలలో స్థానికులకు రిజర్వేషన్లు సాధించడం కోసం కృషి చేసింది.
తెలంగాణ లెక్చరర్స్ ఫోరం :
- ప్రభుత్వ ప్రైవేటు మరియు ఎయిడెడ్ కళాశాల అధ్యాపకులకు 2007 July 8న ఆవిర్భవించింది
- దీనికి అధ్యక్షులుగా మురళీమనోహర్ ఉపాధ్యక్షుడిగా చంద్రశేఖర్, షబ్బర్ అలీ, కృష్ణ కుమార్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కత్తి వెంకటస్వామి ఎన్నికయ్యారు
- ప్రస్తుతం తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడుగా కత్తి వెంకటస్వామి మరియు ప్రధాన కార్యదర్శిగా యు.సిద్దేశ్వర్ కొనసాగుతున్నారు.
తెలంగాణ ప్రైవేటు రంగ ఎంప్లాయీస్ అసోసియేషన్ :
June 15, 2008న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయబడింది
ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 80% ప్రైవేట్ ఉద్యోగాలు మరియు జిల్లా స్థాయిలో ఏర్పడిన ప్రైవేట్ సంస్థలలో 100% ఉద్యోగాలు స్థానికులకే కేటాయించేందుకు కృషి చేస్తుంది.