Telangana Movement Between 1970 to 2000 - తెలంగాణ సాంస్కృతిక రచయిత సంఘాలు

Telangana Movement Between 1970 to 2000 తెలంగాణ సాంస్కృతిక రచయిత సంఘాలు 


తెలంగాణ సాంస్కృతిక వేదిక 

  • 1stనవంబర్ 1998 న బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో స్థాపించబడింది ఇందులో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, అంబటి సురేంద్రరాజు, నందిని సిద్ధారెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి, K. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు


తెలంగాణ రచయితల వేదిక 

  • దీనిని 2001 అక్టోబర్ 14న సిద్ధిపేట లో స్థాపించారు
  • దీనికి మొదటి అధ్యక్షుడిగా నందిని సిద్ధారెడ్డి మరియు కార్యదర్శిగా వేణు సంకోజు నియమితులయ్యారు
  • ఇది తెలంగాణ సాహిత్య అస్తిత్వాన్ని పునరుద్ధరించడం కోసము 'సోయి' అనే పత్రికను స్థాపించింది

ధూమ్ దాం

  • మలిదశ ఉద్యమంలో తెలంగాణ కు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు తెలియచెప్పడానికి ఏర్పాటుచేసిన సాంస్కృతిక వేదిక తెలంగాణ ధూమ్ ధామ్
  • దీని యొక్క తొలి ప్రదర్శన September 30, 2002 కామారెడ్డి లో జరిగింది
  • రసమయి బాలకిషన్, అంద శ్రీ, వరంగల్ శంకర్, గోరటి వెంకన్న, విమలక్క మరియు గూడా అంజయ్య తమ ఆట పాటలతో అలరించారు
  • ధూమ్ దాం దశాబ్ది ఉత్సవాలు December 22, 2012న హైదరాబాదులో ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగాయి


తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య  

  • దీనిని గూడ అంజయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, V S రావు తదితరులు 2007 లో స్థాపించారు
  • దీనికి అధ్యక్షులుగా గూడ అంజయ్య, గౌరవ అధ్యక్షులుగా గద్దర్, సలహాదారులుగా B.S. రాములు, పాశం యాదగిరి నియమించబడ్డారు

తెలంగాణ సింగిడి రచయితల సంఘం 

  • సింగిడి అనగా హరివిల్లు, ఇంద్రధనస్సు అని అర్థం
  • ఇది సెప్టెంబర్ 21, 2008న స్థాపించబడింది