Role of Organizations, Meetings in the 1969 Telangana Movement - ( 1969 ఉద్యమంలో వివిధ సంస్థలు సదస్సులు వాటి పాత్ర )
తెలంగాణ ప్రజా సమితి
March 25th, 1969 న హైదరాబాదులో తెలంగాణ ప్రజా సమితి ఏర్పడింది.
అధ్యక్షుడు - మదన్ మోహన్
April 6th న మదన్ మోహన్ పి డి చట్టం కింద అరెస్టు కావడంతో అతని స్థానంలో S. వబి గిరి అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
April 15th న తెలంగాణ ప్రజా సమితి "తెలంగాణ పోరాట దినం" ను పాటించారు.
తెలంగాణ ఉద్యమకారులు April 22న "తెలంగాణ వంచన దినం" ను పాటించారు. శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి తరపున S. వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పై విజయం సాధించాడు. దీంతో తెలంగాణ ఉద్యమ కారులలోనూతన ఉత్సాహం వెల్లివిరిసింది.
Telangana Prajasamithi - తెలంగాణ ప్రజా సమితి |
ఏప్రిల్ లో రాజకీయ నిరుద్యోగిగా ఉన్న చెన్నారెడ్డి గారు ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని ప్రకటిస్తూ ఉద్యమంలోకి ప్రవేశించారు.
May లో ఇతను తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు అయ్యాడు.
ఇతనికి పోటీగా కొండా లక్ష్మణ్ బాపూజీ "తెలంగాణ కాంగ్రెస్ కమిటీ" ని, శ్రీధర్ రెడ్డి పోటీ తెలంగాణా ప్రజా సమితిని స్థాపించారు.
తెలంగాణ ప్రజా సమితి May 1న "డిమాండ్స్ డే" పాటించాలని పిలుపునిచ్చింది.
May 1న చార్మినార్ నుంచి రాజ్ భవన్ వరకు మరియు సికింద్రాబాద్ నుంచి రాజ్ భవన్ వరకు ఊరేగింపు నిర్వహించి గవర్నర్ కు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించారు.
చార్మినార్ నుండి జరిగే ఊరేగింపునకు మదన్ మోహన్, మల్లికార్జున్, కేశవరావు జాదవ్ సారథ్యం వహించారు.
చార్మినార్ దగ్గర ఉద్యమకారులను ఉద్దేశించి మాజీ ఉప ముఖ్యమంత్రి (Deputy CM) అయిన కొండా వెంకట రెడ్డి ప్రసంగించారు.
సికింద్రాబాద్ నుండి జరిగే ఊరేగింపునకు S.B. గిరి, నాగం కృష్ణ, గౌతులచ్చన్న నాయకత్వం వహించారు.
May 1న జరిగిన అల్లర్లకు బాధ్యుడని పేర్కొంటూ అడ్వకేట్ అయిన P.V. పద్మనాభాన్ని అరెస్టు చేశారు. దీనికి నిరసనగా సికింద్రాబాద్ లో పోలీస్
కుమార్, నరేందర్ అనే ఇద్దరు వ్యక్తులు బాంబు విసిరారు. ఈ బాంబు దాడిలో ఫరూఖ్ అలీ అను కానిస్టేబుల్ మరణించాడు.
ఈ బాంబు తయారీ కుట్ర కేసులో అరెస్టు చేయబడ్డ విద్యార్థి నాయకుడు ఫై జె సూరి.
తెలంగాణ మృత వీరుల దినంను MAY 15న హైదరాబాద్లో నిర్వహించారు.
తెలంగాణ ప్రజా సమితి JUNE 2 న తెలంగాణ బంద్ జరిపింది.
హైదరాబాద్ నగరంలో బంద్ పాటించిగా, అబిడ్స్ లోని హోటల్ దుర్గా విలాస్ తెరిచి ఉంచారు దీంతో ఆగ్రహించిన విద్యార్థి నాయకుడు ప్రేమ్ కిషోర్ హోటల్లోకి వెళ్లగా అతనిని కత్తులతో పొడిచి చంపినారు.
1969 JUNE 4న హైదరాబాద్ నగరంలో ప్రధాని ఇందిరాగాంధీ పర్యటించి తెలంగాణ ప్రజా సమితి నాయకులు, ఇతర ఉద్యమకారులతో చర్చించారు.
తెలంగాణ ప్రజా సమితి JULY 12న "తెలంగాణ లిబరేషన్ డే" పాటించారు.
1969 JULY 12న "తెలంగాణ ఫ్లాగ్ డే" ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసామియ బజార్ లో DR మేల్కొటి ప్రత్యేక తెలంగాణ పతాకాన్ని ఆవిష్కరించారు
P.D చట్టం కింద అరెస్టు చేయబడిన మొట్టమొదటి గెజిటెడ్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ కిషన్.
For Job Notifications CLICK HERE TSPSC WEBSITE CLICK HERE