Telangana State Formation-2009 ఎన్నికలు పార్టీలు

Telangana State Formation - 2009 ఎన్నికలు పార్టీలు

2009 ఎన్నికలు పార్టీలు పొత్తులు 

  • రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. సామాజిక న్యాయం పేరుతో నటుడు చిరంజీవి 2008 August 26న ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు. సామాజిక తెలంగాణకు తాను కట్టుబడి ఉన్నానని ప్రకటించాడు 
  • 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ TRS వామపక్ష కూటమి కలిసి పోటీ చేసింది. 
  • అనంతర పరిస్థితుల్లో సిపిఎం, సిపిఐ, TRS లు కాంగ్రెస్ కు దూరం అయ్యాయి 
  • 2009 జనవరి 16న 'తల్లి తెలంగాణ పార్టీ' ని TRS లో విలీనం చేస్తున్నట్లు విజయశాంతి ప్రకటించారు 
  • 2009 జనవరి 31న టిడిపి, TRS, సిపిఎం, సిపిఐ పార్టీల మధ్య పొత్తు కుదిరింది 
  • ఉమ్మడిగా 'మహాకూటమి' పేరుతో ఎన్నికల బరిలోకి దిగాలని పార్టీలు నిర్ణయించాయి. ఈ పొత్తులో జయశంకర్ సార్ కీలకంగా వ్యవహరించారు 
  • తెలంగాణకు తాను అనుకూలమని తెలంగాణపై సంయుక్త సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు 2009 February 12న ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డి హడావిడిగా ప్రకటించాడు 
  • తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ కు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ 2nd February  2009 న సికింద్రాబాద్ లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారు 


ఎన్నికల మేనిఫెస్టోలు  

  • TDP తమ ఎన్నికల మేనిఫెస్టోలో తొలిసారిగా తెలంగాణ అంశాన్ని చేర్చింది 
  • బిజెపి మరోసారి చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి ప్రస్తావించింది 
  • CPI జాతీయ విధానం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించక పోయిన తెలంగాణకు సంబంధించినంత వరకు జాతీయ కార్యవర్గం మినహాయింపునిచ్చింది 
  • CPM రాష్ట్రాల విభజనకు తమ పార్టీ వ్యతిరేకం అని మేనిఫెస్టోలో ప్రకటించింది 
  • BSP చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాము సుముఖుతమని మేనిఫెస్టోలో ప్రకటించింది 
  • ప్రజారాజ్యం 'సామాజిక తెలంగాణకు' తాము కట్టుబడి ఉన్నట్లు తన మ్యానిఫెస్టోలో పేర్కొంది 



ఎన్నికలలో కాంగ్రెస్ విజయం

  • APRIL 16న తెలంగాణలో మొదటి దశలో ఎన్నికలు పూర్తి అయ్యాయి 
  • ఆ తరువాత ఆంధ్ర ప్రాంతంలో YSR ప్రాంతీయ విద్వేషాలను రెచ్చ గొడుతూ ప్రసంగించాడు.  
  • 2009లో కాంగ్రెస్ పార్టీ 152 సీట్లు గెలుచుకుని తిరిగి అధికారంలోకి వచ్చింది 
  • TRS కు రెండు ఎంపి స్థానాలు, పది అసెంబ్లీ స్థానాలు వచ్చాయి