Telangana State Formation Rossayya Committee - రోశయ్య కమిటీ
కేసీఆర్ రాజీనామా
2006 సెప్టెంబర్ 12న ఎం.సత్యనారాయణ చేసిన సవాలును స్వీకరించిన K C R ఎంపీ పదవికి రాజీనామా చేసి అక్టోబర్ 8thన సిద్దిపేట సమర శంఖారావం పేరుతో సభను నిర్వహించారు
2006 డిసెంబరు 4న కేసీఆర్ రాజీనామా చేసిన పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు నిర్వహించగా ఆ ఎన్నికల్లో కేసిఆర్ రెండు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొంది డిసెంబర్ 22న నల్గొండ పట్టణంలో తెలంగాణ ఆత్మగౌరవ సభను నిర్వహించారు
నల్గొండ నగారా పేరుతో 2007 April 6 నుండి 12 వరకు ఫ్లోరైడ్ పీడిత గ్రామాలలో KCR పర్యటించాడు
2007 July 15న మైనారిటీ సంక్షేమం కోసం ఇందిరాపార్క్ వద్ద KCR ఒక్కరోజు నిరాహార దీక్ష చేశాడు
15th నవంబర్ 2007న పసునూరు దయాకర్ రావు డిజైన్ చేసిన 'తెలంగాణ తల్లి విగ్రహాన్ని' తెలంగాణ భవన్ లో కేసీఆర్ ప్రతిష్టించాడు
2008 MARCH 2న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద KCR ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించబడింది
2008 జూన్ 1న ఉప ఎన్నికల ఫలితాలలో టిఆర్ఎస్ పార్టీ రెండు లోక్ సభ స్థానాలు (కరీంనగర్ మరియు హనుమకొండ) మరియు 7 అసెంబ్లీ స్థానాల్లో(సిద్దిపేట, దొమ్మాట, కమలాపూర్, హుజూరాబాద్, మేడారం, చేర్యాల మరియు ఆలేరు) గెలుపొందింది
2009 October 21న మెదక్ జిల్లాలోని సిద్దిపేట లో ఉద్యోగ గర్జన నిర్వహించారు
రోశయ్య కమిటీ
February 12, 2009 న ఆర్థిక మంత్రి రోశయ్య నేతృత్వంలో ఉభయ సభ సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు
ఈ కమిటీకి చైర్మన్: రోశయ్య
సభ్యులు:
1) కొణతాల రామకృష్ణ
2) గీతారెడ్డి
3) ఉత్తమ్ కుమార్ రెడ్డి
4) శ్రీధర్ బాబు
5) పద్మరాజు
6) షేక్ హుస్సేన్
7) అక్బరుద్దీన్ ఓవైసీ
గిర్ గ్లాని కమిషన్
25th June 2001న తెలంగాణ ప్రజలను సంతృప్తిపరచడానికి 610 జీవో అమలు కొరకు గిర్ గ్లాని కమిషన్ ను ఏర్పాటు చేశారు
2001 October 6న గిర్ గ్లాని కమిషన్ తన తొలి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది
2004 September 30న గిర్ గ్లాని కమిషన్ తన తుది నివేదికను అందించింది
ఈ కమిషన్ 1975-2001 మధ్యకాలంలో అనేక ఉల్లంఘనలు జరిగాయని పేర్కొంది