Telangana State Formation - తెలంగాణ మలిదశ ఉద్యమం
తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rastra Samithi T.R.S)
- తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉండటంతో '2001 April 27'న KCR హైదరాబాద్ లోని జలదృశ్యం( కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నివాసం ) లో తెలంగాణ రాష్ట్ర సమితి ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు
- ఇది 15th May 2001 న కరీంనగర్ లో 'సింహగర్జన' పేరుతో సభ జరిపింది. దీనికి జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు శిబుసొరేన్ తెలంగాణకు మద్దతు తెలిపారు
- జూన్ 1, 2001 న పాలమూరులో, జూన్ 2న నల్గొండ, జూన్ 4న నిజామాబాద్, జూన్ 5న నిర్మల్ మరియు జూన్ 21న వరంగల్ లో భారీ సభలు నిర్వహించారు
- 2001 జూలై లో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలలో TRS పార్టీ నాగలి గుర్తుపై పోటీ చేసి కరీంనగర్(రాజేశ్వరరావు), నిజామాబాద్ (సంతోష్ కుమార్) జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను గెలుచుకుంది
- ఇది 1000 MPTC స్థానాలను, 87 ZPTC స్థానాలు, 84 ఎంపిపి స్థానాల్లో గెలిచింది
- 2001 NOVEMBER 17thన ప్రజా గర్జన సభను ఖమ్మంలో నిర్వహించింది
- 2002 MARCH 27thన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో శంఖారావ సభ నిర్వహించారు
- 2002 ఏప్రిల్ 27న TRS ప్రథమ వార్షికోత్సవ సభను నల్గొండలో నిర్వహించింది. ఈ సభకు శిబుసొరేన్, అజిత్ సింగ్ మరియు భీమ్ సింగ్ హాజరయ్యారు.
టిఆర్ఎస్ కార్యక్రమాలు (Programmed by T.R.S)
- TRS పార్టీ 2002 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 7 వరకు పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించింది
- NAVEMBER 25, 2002 - జనవరి 6, 2003 వరకు జలసాధన కార్యక్రమాన్ని నిర్వహించింది
- JANUARY 6, 2003న హైదరాబాద్ నగరంలోని జింఖానా గ్రౌండ్స్ లో 'తెలంగాణ గర్జన' పేరుతో ఒక మహాసభను నిర్వహించింది
- ఏప్రిల్ 27th, 2003 న వరంగల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సమితి ద్వితీయ వార్షికోత్సవ సభలు జరిగాయి. ఈ సభకు TRS పార్టీ వరంగల్ జైత్రయాత్ర అనే నామకరణం చేసింది
- రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి KCR 2003 మే 20-25 వరకు మహబూబ్ నగర్ లోని ఆలంపూర్ నుండి గద్వాల్ వరకు పాదయాత్ర చేశారు
- 2003 ఆగస్టులో మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ లో కోలాహలం సభ, నాగర్ కర్నూలులో నగారా సభ(2003 సెప్టెంబర్) నిర్వహించారు
- నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో KCR 2003 ఆగస్టు 25-30 వరకు కోదాడ నుండి హాలియా వరకు పాదయాత్ర చేశారు
- TRS పార్టీ తెలంగాణ వాదనను ఢిల్లీకి చేరవేయడానికి 2003 March 27న హైదరాబాద్ పలక్ నమా ప్యాలెస్ నుండి ఢిల్లీకి కారు ర్యాలీ చేపట్టారు
- 2003 September 9న మౌలంకార్ హోటల్ లో వివిధ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేతలు సభ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రత్యేక రాష్ట్రాల జాతీయ కన్వీనర్ గా కేసీఆర్ ను ఎన్నుకున్నారు
- కాకినాడ తీర్మానం అమలు చేయక పోయేసరికి ఆలే నరేంద్ర BJP నుండి బయటకు వచ్చి 'తెలంగాణ సాధన సమితి' అనే పార్టీని స్థాపించారు
- KCR తో సంప్రదింపుల అనంతరం తెలంగాణ కోసం ఐక్యంగా పోరాడాలని నిర్వహించి 2002 ఆగస్టు 11న టిఆర్ఎస్ లో తెలంగాణ సాధన సమితి విలీనమైంది
- September 17, 2003న ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ముందు భారీ బహిరంగ సభను విద్యార్థులను ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకునేలా దోహదం చేసింది
- 2003 నవంబర్ 19న మెదక్ జిల్లాలో 'సింగూరు సింహగర్జన' అనే పేరుతో బహిరంగ సభ
- 2003 November 21న మహబూబ్ నగర్ జిల్లాలో 'పాలమూరు సింహ గర్జన'
- 2003 December 3న నిజామాబాద్ లో 'ఇందూరు సింహ గర్జన'
- 2003 December 5న వరంగల్ లో 'ఓరుగల్లు సింహ గర్జన'
- 2003 డిసెంబర్ 16న సిరిసిల్లలో 'కరీంనగర్ కథనభేరి' నిర్వహించారు