Telangana State Formation-ప్రవాస భారతీయులు
ప్రవాస భారతీయులు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(Telangana Development Forum)
- 1999లో అమెరికాలో మొదటిసారిగా అందుకే రెడ్డి ప్రారంభించారు.
- ఇది www.telangana.com అనే వెబ్సైట్ ను ఏర్పాటు చేసింది.
- 18 December 2011న తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ఇండియా ఆధ్వర్యంలో కరీంనగర్ లోని రెవెన్యూ గార్డెన్ లో నాలుగో ప్రవాసీ తెలంగాణదివస్ ను నిర్వహించింది.
తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్(Telangana NRI Association)
- ఇది 2007లో ఏర్పడింది. దీనికి చైర్మన్ గా నారాయణస్వామి వెంకటయ్యలు మరియు అధ్యక్షుడిగా వెంకట్ మారోజు నియమించబడ్డారు.
- ఇది సకల జనుల సమ్మెకు మద్దతుగా అమెరికాలోని వాషింగ్టన్ లో 2011 October 15thన 'తెలంగాణ ప్రవాస్' పేరిట భారీ ప్రదర్శనను నిర్వహించింది.
వైద్యులు(Doctors)
- తెలంగాణ డాక్టర్స్ ఫోరం ను ఏర్పాటు చేసి దీనికి A.గోపాల్ కిషన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
- తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం Dr.రమేష్ నాయకత్వంలో పని చేయగా, డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పేరుతో డాక్టర్ల జెఎసి Dr.బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో పనిచేసింది.
- January 22, 2010 న తెలంగాణ వైద్య గర్జన పేరుతో ఉస్మానియా మెడికల్ కాలేజీలో సభ నిర్వహించారు.
- 2011 March 1న పల్లెపల్లెకు పట్టాలపై కార్యక్రమంలో భాగంగా వైద్యులు పట్టాలపైన పాలీ క్లినిక్ పేరుతో వైద్య సేవలను అందించారు.
- May 15th, 2013 వైద్యుల శంఖారావం పేరుతో రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో సభను నిర్వహించారు.
సంఘటిత - అసంఘటిత రంగాల పాత్ర(Low Category Employees)
- ఇందులో సింగరేణి, రోడ్డు రవాణా సంస్థ, సిమెంట్ కంపెనీ, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న సంఘటిత వర్గాలు పాల్గొన్నాయి.
- 2011 ఫిబ్రవరి 17 నుండి రాజకీయ JAC పిలుపు నిచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమంలో, సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు మరియు ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించారు.
- సింగరేణి కార్మికులు సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 17 వరకు, ఆర్టీసీ కార్మికులు సెప్టెంబర్ 18 నుంచి OCTOBER 16 వరకు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు.
- 2010 మే 23న ప్రవేట్ సెక్టార్ ఎంప్లాయిస్ JAC ఆధ్వర్యంలో విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన సదస్సు జరిగింది.
- 19 JULY 2012న 'భూమిపుత్రుల పాదయాత్ర' పేరుతో యాత్ర నిర్వహించారు.
సింగరేణి యాత్ర (Singareni Yaatra)
తెలంగాణ JAC 2011 నవంబర్ 9న సింగరేణి యాత్ర చేపట్టాలని నిర్ణయించింది దీనికి మూడు బృందాలను ఏర్పాటు చేసింది.
1. కోదండరాం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని కోల్ బెల్ట్ ప్రాంతాన్ని సందర్శించారు.
2. టీ-జేఏసీ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గోదావరిఖనిప్రాంతంలో సందర్శించారు.
3. T-JAC కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో కోల్ బెల్ట్ ప్రాంతాన్ని సందర్శించారు.