వాకాటకులు - Vakataka Dynasty Study Material in Telugu

 Vakataka Dynasty Study Material in Telugu

  • శాతవాహన సామ్రాజ్యం పతనమైన తరువాత మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో అభిరులు మరియు తూర్పు బీహార్ ప్రాంతంలో వాకాటకులు స్వతంత్రం ప్రకటించుకున్నారు
  • వీరు ఉత్తరాన గుప్త, నాగ వంశాలతో, తూర్పు దక్కన్ విష్ణుకుండిలతో మరియు పశ్చిమ దక్కన్ కదంబులతో వైవాహిక సంబంధాలు ఏర్పరుచుకున్నారు
  • తొలి వాకాటకుల శాసనం ప్రకారం వీరి రాజధాని -- పురికాపట్టణం మరియు చనక . తరువాత వార్ధా సమీపంలోని ప్రవరపురం(ఫౌనాడ్) రాజధానైనది.
  • వీరి పరిపాలన కాలం క్రీ.శ.250-550
  • వాకాటకుల శాసనాలు సంస్కృత భాషలో, బ్రహ్మలిపిలో ఉన్నాయి.
  • మంథాల్ తామ్రశాసనలు వేయించింది -- రెండవ రుద్రసేనుడు
  • రెండవ ప్రవరసేనుడి శాసనాలు -- ఇండోర్, యానాత్మల్, మసోడ్ మరియు మంథాల్ . 19 మంది బ్రాహ్మణులకు భూదానం చేస్తూ మాసోద్ శాసనాలు వేయించాడు.
  • రెండవ పృథ్విసేనుడి శాసనాలు -- మంథాల్, మహర్జారీ
  • ప్రభావతిగుప్త  మరియు  రెండవ ప్రవరసేనుడు కాలంలో వేయించిన శాసనం మీరేగామ్ 1912 లో పూనా దగ్గర దొరికింది.
  • సుదర్శన సరోవరాన్ని నిర్మించినది - దేవసేనుడి అధికారి ఆర్య స్వామిల్లదేవుడు. బీదర్ శాసనాలు వేయించింది -- దేవసేనుడు (ఒక గ్రామాన్ని దానం చేస్తూ వేయించింది)
  • గుప్తుల కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు - షాహియాన్ (క్రీ. శ . 400-411)
  • వింధ్యకులు అనే రాజ్య వంశాన్ని స్థాపించినది -- విందాశక్తి
  • వాకాటక రాజ్య పతనం గూర్చి తెలియజేసేది -- దశకుమార చరిత్రలోని విసూత్ర చరిత్ర
  • రెండవ ప్రవరసేనుడు రచించిన కావ్యం -- సేతుబంధం
  • అజంతా వద్ద గల 16, 17 గుహల్లోని బుద్దిని మరియు బోధిసత్యాల చిత్రాలు తొలిపించినది -- వాకాటక రాజులు, వారి సామంతులు.


మొదటి వింద్యాశక్తి (క్రీ.శ . 250-270)

  • ఇతను వాకాటకా వంశ స్థాపకుడు 
  • ఇతను ఎటువంటి బిరుదులూ ధరించలేదు 


మొదటి ప్రవరసేనుడు (క్రీ.శ. 270-330)

  • ఇతను నిజమైన వాకాటక సామ్రాజ్య స్థాపకుడు 
  • శిశుకుడు పరిపాలించే పురికా రాజ్యాన్ని ఆక్రమించాడు. 
  • ఇతను వైదిక మతాన్ని ఆచరించాడు 
  • నాలుగు అశ్వమేగ యాగాలు చేసాడు 
  • తనకు తాను హారీతి పుత్రునిగా చెప్పుకున్నాడు 


ప్రవరపుర - నందివర్ధన శాఖ 

మొదటి రుద్రసేనుడు (క్రీ.శ .330-355)

  • ఇతను ప్రవరసేనుని మనుమడు (గాటమ పుత్రుని కుమారుడు)
  • ఇతను అనేక రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొన్నాడు  వాకాటక రాజ్యం నాలుగు భాగాలుగా విడిపోయింది 

మొదటి పృథ్విసేనుడు (క్రీ.శ . 355-380)

  • ఇతడు రుద్రసేనుడు కుమారుడు 
  • ఇతడిని పాండవులలో ధర్మరాజుతో పోల్చుతారు 
  • యితడు రాజధానిని నాగపూర్ సమీపంలోని 'నందివర్ధనానికి' మార్చాడు. 

రెండవ రుద్రసేనుడు (క్రీ.శ . 380-385)

  • ఇతని తండ్రి మొదటి పృథ్విసేనుడు 
  • ఇతని కాలంలోనే వాకాటకా రాజ్యం గుప్తులకు సామంత రాజ్యాంగ మారినది 
  • రెండవ ప్రవరసేనుడు (క్రీ.శ . 400-440)
  • నరేంద్ర సేనుడు (క్రీ.శ . 440-460)

రెండవ పృథ్విసేనుడు (క్రీ.శ . 460-480)

  • ఇతను ప్రధాన వాకాటక వంశంలో చివరివాడు 
  • విష్ణుకుండ రాజు మాధవవర్మ ఇతనిని ఓడించాడు 

వాకాటకులు - వత్సగుల్మ శాఖ 

సర్వసేనుడు (క్రీ.శ. 330-355)

  • మొదటి ప్రవరసేనుడు కనిష్ట సోదరుడు, సర్వసేనుడు ఈ శాఖ స్థాపకుడు 
  • వీరి రాజధాని వత్స గుల్మ (విదర్భ ప్రాంతం లోని నేటి బాసిం)
  • ఇతను ప్రాకృతం కావ్యం 'హరివిజయం' ను రచించాడు 

వింధ్యాసేనుడు (క్రీ.శ. 355-400)

  • ఇతను బాసిం శాసనం వేయించాడు 
  • ఇతని మంత్రి ప్రవరుడు దక్షిణంగా ఉన్న కుంతల రాజును ఓడించాడు 

రెండవ ప్రవరసేనుడు (క్రీ.శ. 400-415)

  • ఇతను వింధ్యసేనుడి కుమారుడు 

దేవసేనుడు (క్రీ.శ. 450-475)

హరిసేనుడు (క్రీ.శ. 475-500)

  • ఇతను దేవసేనుడి కుమారుడు 
  • వత్సగుల్మ శాఖలో అందరికంటే గొప్పవాడు 
  • ప్రధాన వాకాటక శాఖకు చెందిన రాజులూ -- వైదిక మతాభిమానులు 
  • వత్సగుల్మ శాఖకు చెందిన రాజులూ -- బౌద్ధ మతాభిమానులు 
  • వాకాటకులు  గొప్ప విద్యాకేంద్రాలు - ప్రవరపురం, వత్సగుల్మ 
  • అజంతాలో మొత్తం 30 గుహలున్నాయి. వీటిని 1819లో కెప్టెన్ జాన్ స్మిత్ కనుగొన్నాడు 
  • అన్నింటికంటే ప్రధానమైనది 16వ గుహ. దీనిని హరిసేనుడు మంత్రి 'వరాహదేవుడు' తొలిపించాడు 
  • వీరు తెలంగాణాలో పరిపాలించిన  ప్రదేశాలు - ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ 
  • వీరికి విష్ణుకుండులు సామంతులుగా ఉండేవారు.