వేములవాడ చాళుక్యులు - Vemulawada Chalukyas Dynasty
వేములవాడ చాళుక్యులు (క్రీ.శ.750 - 973)
వీరు రాష్ట్రకూటుల సామంతులు.
వీరి మూలపురుషుడు సత్యాశ్రయ రణ విక్రముడు (శాసనాల ప్రకారం) (క్రీ.శ.650-675)
పృథ్వీపతి (క్రీ.శ.675-700)
మహారాజు (క్రీ.శ.700-725)
పృధు విక్రముడు (క్రీ.శ.725-750)
కానీ వీరి పరిపాలన కాలం ఎక్కడ పరిపాలించింది స్పష్టంగా లేదు.
వినయాదిత్య యుద్ధమల్లుడు (క్రీ.శ.750-775)
- ఇతను వేములవాడ చాళుక్యుల నిజమైన స్థాపకుడు
- ఇతని రాజధాని బోధన్
- గోదావరి నదికి దక్షిణాన గల మంజీరా నది నుండి మహాకాళేశ్వర పర్వంతం వ్యాపించి ఉన్న భూభాగమే 'పోదనపాడు' దీనినే సపదాలక్షదేశం అంటారు. ఇదే నేటి వేములవాడ చాళుక్య రాజ్యం
- ఇతను రాష్ట్రకూట రాజ్యస్థాపకుడైన దంతిదుర్గుడు యొక్క సేనాధిపతిగా చేసి తరువాత సామంత రాజు అయ్యాడు.
మొదటి అరికేసరి (క్రీ.శ.775-800)
- ఇతడు వినయాదిత్యుడు కుమారుడు
- ఇతని సోదరుడు బీరన్న గృహుడు మరియు బీరన్న గృహుడు వేయించిన శాసనం 'కురువ గుట్ట'
- ఇతను రాష్ట్రకూట రాజు ధ్రువుని యొక్క సామంతుడు
- ఇతను రాజధానిని బోధన్ నుంచి వేములవాడకు మార్చాడు.
- ఇతనికి కల బిరుదులు సమస్త లోకాశ్రయా, త్రిభువనమల్ల, రాజత్రినేత్ర మరియు సాహసరాయది
- మొదటి అరికేసరి వేయించిన శాసనం 'కొల్లిపర శాసనం'
- అరికేసరి యొక్క కుమారుడు నరసింహుడు (క్రీ.శ.800-825)
- నరసింహుడు యొక్క కుమారుడు రెండవ యుద్ధమల్లుడు (క్రీ.శ.825-850)
బద్దెగ (క్రీ.శ.850-895)
- ఇతను రెండవ యుద్ధమల్లుని యొక్క కుమారుడు
- ఇతనికి కల బిరుదు సోలాదగండ మరియు అంటే అపజయమెరుగని యోధుడు అని అర్థం(42 యుద్దాలు చేసినవాడు)
- ఇతను వేంగీ రాజు మొదటి చాళుక్య భీముడిని ఆడించినట్లు మరియు బంధించినట్లు 'పర్బనీ శాసనం (క్రీ.శ.966)' తెలియజేస్తుంది.
- ఇతను వేములవాడలో తన పేరుమీదుగా 'బద్దిగేశ్వర' ఆలయాన్ని నిర్మించాడు.
- ఇతను కుమారుడు యుద్ధమల్లుడు (క్రీ.శ.895-915)
- యుద్ధమల్లుని కుమారుడు రెండవ నరసింహుడు (క్రీ.శ.915-930)
రెండవ నరసింహుడు (క్రీ.శ.915-930)
- ఇతను రాష్ట్రకూట రాజైన మూడవ ఇంద్రునికి (క్రీ.శ.915-922) సామంతుడు
- ఇతను తన దండ యాత్రను గంగా నది వరకు చేసినాడు
- కాళప్రియ వద్ద విజయస్తంభాన్ని నాటాడని వేములవాడ శాసనం తెలియజేస్తుంది. ఇది సంస్కృత శాసనం.
రెండవ అరికేసరి (క్రీ.శ.930-955)
- ఇతను వేములవాడ చాళుక్యులలో గొప్పవాడు
- ఇతని కాలంలోనే వేంగీ రాజ్యంలో వారసత్వ యుద్దాలు మొదలైనాయి
- పంప కవి ఇతని ఆస్థానకవి. ఇతని యొక్క రచనలు విక్రమార్జుని విజయం మరియు ఆది పురాణం
- పంప కవి యొక్క సోదరుడు జీనవల్లభుడు 'కార్క్యల శాసనం' ప్రకారం పంప కవి క్రీ.శ.902 లో జన్మించాడని క్రీ.శ.941లో ఆది పురాణం రచించాడని తెలుస్తుంది.
- ఆదిపురాణం జైనమత మొదటి తీర్థంకరుడు 'వృషబానాధుడు చరిత్ర / పంచకళ్యాణం' గురుంచి తెలుపుతుంది.
వాగరాజు (క్రీ.శ.955-960)
- రాష్ట్రకూట రాజు 3 వ కృష్ణుని సామంతుడు
- ఇతని రాజధాని గంగాధర పట్టణం
- ఇతని ఆస్థాన కవి సోమదేవసూరి. ఇతని రచించిన కావ్యం యశస్తిలక చంపూ
- ఇతనికి సంతానం లేరు
రెండవ బద్దెగుడు (క్రీ.శ.960-965)
- ఇతను వేగరాజు సోదరుడు
- సోమదేవసూరి కోసం 'శుభధామ జీనాలయము'నిర్మించాడని వేములవాడ శాసనం తెలియజేస్తుంది. దీనికి కల మరొక పేరు బద్దెగ జీనాలయము
మూడవ అరికేసరి (క్రీ.శ.965-973)
- వేములవాడ చాళుక్య వంశంలో చివరివాడు
- ఇతను ఫర్భిణి శాసనం (క్రీ.శ.966), కరీంనగర్ తామ్రశాసనం (క్రీ.శ.966) అనే రెండు తామ్రశాసనాలు వేయించాడు.
- ఇతనియొక్క రాజధాని వేములవాడ
ఇతని తరువాత తెలంగాణ ప్రాంతం కళ్యాణి చాళుక్యుల చేతుల్లోకి వెళ్ళింది.
తెలంగాణాలో క్రీ.శ.940 నాటి కర్మాల శాసనంలో మొదటిసారి పద్యాలు లభించాయి.