విష్ణుకుండినులు Vishnukundina Dynasty

Vishnukundina Dynasty Study Material in Telugu

రెండవ ఇంద్ర (భట్టారక) వర్మ (క్రీ.శ. 525 - 555)

  • ఇతను ఘటిక అనే విద్యాసంస్థలను ఏర్పాటుచేసిన మొదటి రాజు 
  • ఇతని కాలంలోనే '1 వ పులకేశి' బాదామి చాళుక్య రాజ్యాన్ని ఏర్పాటుచేశాడు 

రెండవ విక్రమేంద్రవర్మ (క్రీ.శ. 555 - 569)

  • అతి పిన్నవయసులోనే సింహాసనాన్ని అధిష్టించాడు 
  • ఇతని యొక్క బిరుదు 'భువన రక్షాభరణై కాశ్రయ'
  • ఇతను రాజధానిని అమరావతి నుంచి 'దెందులూరు' కు మార్చాడు. 
  • క్రీ.శ.  566లో తుమ్మలగూడెం శాసనం-2 ను వేయించాడు. ఇతను 'చిక్కుళ్ళ శాసనం' కూడా వేయించాడు. 

2వ గోవింద వర్మ (క్రీ.శ. 569 - 573)

  • ఇతనియొక్క బిరుదు విక్రమార్క 
  • ఇతని కాలంలో హణులు ఉత్తర భారతదేశంపై దండెత్తి 'గుప్త సామ్రాజ్యాన్ని' అంతం చేసారు 

4వ మాధవవర్మ (క్రీ.శ. 573 - 623)

  • ఇతని యొక్క బిరుదులు జనాశ్రయ, అవపితా వివిధ దివ్య,  న్యాయశాస్త్ర విశాదారుడు మరియు సూక్ష్మగ్రహి. 
  • వీరి వంశంలో ఇతనియొక్క పాలనా సుదీర్ఘమైనది. 
  • పొలమూరు, ఈపూరు శాసనాలు వేయించాడు. 
  • ఇతని  కాలంలోనే గుణస్వామి 'జనాశ్రయా - ఛందో విచ్చిత్తి' అనే గ్రంథాన్ని రచించాడు.  నుంచి మొదటి సంస్కృత లక్షణ గ్రంథం. 
  • ఇతని కాలంలోనే 'బాదామి చాళుక్యుడు' తెలంగాణను చాలా వరకు ఆక్రమించాడు. అందువలన వీరి రాజధానిని కృష్ణా జిల్లాలోని 'త్రివర నగరానికి' మార్చాడు. 

మంచక భట్టారక వర్మ (క్రీ.శ. 623 - 624)

  • ఇతను చివరి పాలకుడు 
  • రాజ్యాన్ని విషయాలుగా విభజించి పాలించారు 
  • వీరికాలంలో ఒక్కో ఉద్యోగి ఒక్కోపేరుతో పిలిచేవారు 

  1. హస్తికోశ -- గజదళాధిపతి 
  1. వీరకోశ -- పదాతిదళపతి 
  1. గుల్మీకుడు -- గ్రామాధికారి 
  1. అక్ష పటాలాధీకృత -- ప్రభుత్వ పత్రాలను భద్ర పరిచే అధికారి శాసన ఆజ్ఞపులు. 
  1. రజ్జకులు -- భూములు కొలిచి   ఆయకట్టు  నిర్ణయించే వారు 
  1. ఫలదారులు -- పండిన పంటలో  రాజ్య భాగాన్ని నిర్ణయించే అధికారి 
  1. శెట్టి --  ప్రభుత్వానికి చెందవలసిన ధాన్యాన్ని కొలిచే అధికారి 


  • వీరి నాణెములపై శంఖం, సింహం గుర్తులను ముద్రించారు 
  • వీరి రాజ బాష సంస్కృతం 
  • ఈ కాలంలోనే 'భావశర్మ' అనే పండితుడు 'ఉపనిషత్తులను' అధ్యయనం చేసాడు 
  • వీరి కాలం నాటి గొప్ప బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ మరియు బౌద్ధ పండితులలో గొప్పవాడు 'దశ బల బలి'
  • వీరి కళా ప్రాముఖ్యతను 'J.B. Dhubrail' అనే ఫ్రెంచ్ పరిశోధకుడు ప్రపంచానికి చాటి చెప్పాడు 
  • వీరు పల్లవుల దాడి నుంచి రాజ్యాన్ని కాపాడుకోవటాని 'అమ్రాబాద్' ప్రాంతంలో తెలుగుదేశంలోనే అతి పెద్ద కోట.
       Previous...