కళ్యాణి చాళుక్యులు Western Chalukyas History

కళ్యాణి చాళుక్యులు (క్రీ.శ.973-1157) (Western Chalukyas or Kalyani Chalukyas)

వీరిని పశ్చిమ చాళుక్యులు అని కూడా అంటారు 

వీరి మొదటి రాజధాని మాన్యఖేటం మరియు తరువాత కళ్యాణి ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు 

వీరి రాజ్యస్థాపకుడు రెండవ తైలవుడు


రెండవ తైలవుడు (క్రీ.శ.973-997)

  • క్రీ.శ.957 నాటికి ఇతను రాష్ట్రకూట సామంతుడు 
  • క్రీ.శ.973 లో చివరి రాష్ట్రకూట రాజైన 2వ కర్కుని జయించి కళ్యాణి చాళుక్య స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు 
  • ఇతని బిరుదులు మహాసామంతదిప, చాళుక్య రామ మరియు సత్యాశ్రయ కుల తిలక, ఆహవమల్ల,పృథ్విమల్ల 
  • చోళ చక్రవర్తి 'రాజరాజు' ఇతనికి సమకాలీనుడు 


సత్యాశ్రయుడు (క్రీ.శ .997-1008)

  • ఇతను రెండవ తైలవుని పెద్ద కుమారుడు 
  • ఇతని బిరుదులు ఇరివి  బెందగ, ఆకలంక చరిత 
  • ఇతని కుమార్తె పంపాదేవి ని పల్లవరాజు ఇరివ నోలంబాది రాజుకు ఇచ్చి వివాహం చేశాడు 
  • ఇతనికి జైనపండితుడైన 'విమలచంద్రుడు' గురువు

ఐదవ విక్రమాదిత్యుడు (క్రీ.శ .1008-1018)

  • ఇతనియొక్క బిరుదు త్రిభువనమల్ల 

రెండవ జయసింహుడు (క్రీ.శ .1018-1042)

  • ఇతని సేనాని 'చావనరస' కు కొంకణ ధూమకేత అనే బిరుదు కలదు 
  • ఇతని యొక్క బిరుదులు జగదేకమల్ల, త్రైలోకమల్ల, విక్రమసింహ 

మొదటి సోమేశ్వరుడు (క్రీ.శ .1042-1068)

  • ఇతని యొక్క బిరుదులు  ఆహనమల్ల, రాజ నారాయణ మరియు త్రై లోకమల్ల
  • ఇతను కళ్యాణి చాళుక్యులలో గొప్పవాడు 
  • ఇతను కళ్యాణి నగరాన్ని నిర్మించి తన రాజధానిగా చేసుకున్నాడు 

రెండవ సోమేశ్వరుడు (క్రీ.శ .1068-1076)

  • ఇతని యొక్క బిరుదు భువనైకమల్ల 

ఆరవ విక్రమాదిత్యుడు (క్రీ.శ .1076-1126)

  • ఇతని ఆస్థానకవి బిల్హణుడు (రచన విక్రమాంకదేవ చరిత్ర)
  • క్రీ.శ .1076 లో చాళుక్య విక్రమ శకం ప్రారంభమైనది 
  • ఇతని యొక్క బిరుదు త్రిభువనమల్ల 

మూడవ సోమేశ్వరుడు (క్రీ.శ .1126-1138)

  • ఇతను విజ్ఞాన సర్వస్వమని వర్ణించిన 'అఖిల షితార్థ చింతామణి' అనే గ్రంథాన్ని రచించాడు. దీనినే 'మానసోల్లాసం' అని కూడా అంటారు 

జగదేకమల్లుడు (క్రీ.శ .1138-1151)